Destruction of the temple dome: పెద్దపల్లి జిల్లా ముత్తారం ధర్మాబాద్ గ్రామంలోని అతి పురాతనమైన ఆండాలమ్మ ఆలయ గోపురాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన వెలుగు చూసింది. ముందుగా లోపలికి వెళ్లడానికి పెద్ద రంధ్రం చేశారు. లోపలికి ప్రవేశించిన అనంతరం నిచ్చెన సహాయంతో ఆలయంపైకి ఎక్కి గోపురాన్ని ధ్వంసం చేశారు.
పెద్దపల్లి జిల్లాలో ఆలయ గోపురం ధ్వంసం - గుప్తనిధుల కోసమే!
Destruction of the temple dome (ETV BHarat)
Published : Aug 31, 2024, 1:15 PM IST
శుక్రవారం రాత్రి (ఆగస్టు 30) ఆలయ గోపురం ధ్వంసానికి గురికావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుప్త నిధుల కోసం దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఆండాలమ్మ దేవాలయం పర్యాటక కేంద్రంగా కూడా పేరుగాంచింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పెద్దపల్లి పోలీసులు తెలిపారు.