ETV Bharat / state

ఇంటి వద్దే జీవన్‌ ప్రమాణ పత్రం - ఆ డాక్యుమెంట్స్​ చూపిస్తే చాలు - DIGITAL LIFE CERTIFICATE SERVICES

విశ్రాంత ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్న తపాల శాఖ - పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సేవలు

Post Office Digital Life Certificate Services
Post Office Digital Life Certificate Services (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 12:40 PM IST

Post Office Digital Life Certificate Services : విశ్రాంత ఉద్యోగులకు తపాల శాఖ బాసటగా నిలుస్తోంది. ఖజానా కార్యాలయానికి నడిచి వెళ్లలేని వారి కోసం పోస్ట్‌ ఆఫీస్‌ సిబ్బంది వచ్చి నేరుగా జీవన్‌ ప్రమాణ పత్రం (డిజిటలైజేషన్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌) అందించే సౌకర్యం కల్పిస్తోంది. తపాల ఉద్యోగికి అవసరమైన పత్రాలు చూపిస్తే అప్పటికప్పుడే ఆన్‌లైన్‌ నమోదు చేసి దానికి నామమాత్రంగా రూ.70 చెల్లించాలి.

ఏటా నవంబరు, డిసెంబరులో విశ్రాంత ఉద్యోగాలు తాము జీవించి ఉన్నామని ఖజానా కార్యాలయానికి లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఈ క్రమంలో వారు స్వయంగా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించాలి. నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి పోస్ట్‌ ఆఫీస్‌ సిబ్బంది ఇంటికి దగ్గరే సేవలు అందిస్తోంది. ఇందుకోసం ఐపీపీబీ లేద పోస్టుమ్యాన్‌ను సంప్రదించాలి. కామారెడ్డి, నిజామాబాద్‌లో రెండు ప్రధాన, 60 ఉప, 419 శాఖ పోస్ట్‌ ఆఫీస్‌ కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు(జీవన్‌ ప్రమాణ పత్రం) కాగితం రహితంగా పొందవచ్చు.

ఆ పోస్టాఫీస్​లో మీకు అకౌంట్ ఉందా - ఉంటే ఓసారి చెక్​ చేసుకోండి!

"విశ్రాంత ఉద్యోగులకు ఇంటి వద్దే లైఫ్‌ సర్టిఫికెట్‌ సేవలు అందిస్తున్నాం. సమీప పోస్టుమెన్, ఐపీపీబీలో సేవల కోసం సంప్రదిస్తే ఇంటి వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌ ద్వారా సేవలందిస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి." - జనార్దన్‌రెడ్డి, తపాలా శాఖ సీనియర్‌ సూపరింటెండెంట్, నిజామాబాద్‌

ఇవి ఉంటే సరి పోతుంది

  • పింఛన్‌ ఖాతా, ఆధార్, మొబైల్‌ నంబరు తప్పని సరి
  • పింఛన్‌ పేమెంట్‌ ఆర్డర్‌
  • బ్యాంక్‌ ఖాతా వివరాలు

భార్య.. భర్త.. ఓ దోపిడీ - పోస్టాఫీసులో ఉద్యోగ దంపతుల భారీ మోసం

పోస్టల్​శాఖ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.