ETV Bharat / health

రోజు అరగంట వాకింగ్ చేస్తే సూపర్ ఫిజిక్ మీ సొంతం! ఇంకా ఎన్నో లాభాలట! - WALKING BENEFITS FOR HEALTH

-వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు పరిశోధకుల వెల్లడి -అంతర్గతంగా కాకుండా శరీరాకృతిలోనూ అనేక మార్పులు

Walking Benefits for Health
Walking Benefits for Health (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Nov 25, 2024, 1:14 PM IST

Walking Benefits for Health: వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. European Journal of Preventive Cardiology ఓ అధ్యయనం ప్రకారం.. గుండె సమస్యల బారిన పడి మరణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. The association between daily step count and all-cause and cardiovascular mortality: a meta-analysis అనే అధ్యయనంలో పోలండ్​లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ Maciej Banach పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). అయితే, రోజు 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఇలా అంతర్గతంగానే కాకుండా బయటికి కూడా కొన్ని ప్రయోజనాలు కనిపిస్తాయని అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే అవేంటో తెలుసుకుందాం.

మంచి శరీరాకృతి: రెగ్యులర్​గా వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా మారి శరీరాకృతి మారుతుందని నిపుణులు అంటున్నారు. శరీరం వంగిపోకుండా నిటారుగా నిలబడతారని.. సూపర్ ఫిజిక్ ఉంటుందని వివరించారు. ఫలితంగా మీలో కాన్ఫిడెంట్ పెరుగుతుందని చెబుతున్నారు.

బరువు తగ్గుతారు: రోజూ వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని.. దీనిని మీరు ఈజీగా గమనించవచ్చని తెలిపారు. వాకింగ్ వల్ల కెలరీలు కరిగి బరువు తగ్గుతారని, ఇంకా కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుందని వివరించారు. ముఖ్యంగా కాళ్లు, తొంటి, కడుపు భాగంలో కొవ్వును తగ్గించి నాజుగ్గా కనిపించేలా చేస్తుందన్నారు.

కాళ్లలో దృఢత్వం: వాకింగ్ వల్ల ముఖ్యంగా శరీర కింది భాగంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కాళ్ల కండరాలు దృఢంగా మారి మంచి ఆకారంలో కనిపిస్తాయని చెబుతున్నారు. ఫలితంగా కాళ్ల సామర్థ్యం పెరిగి.. రోజూవారీ కార్యకలాపాలు సులభంగా చేసుకోనేలా సాయపడతాయని వివరించారు.

చర్మం కాంతివంతం: వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి చర్మానికి ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందుతాయని వెల్లడించారు. ఫలితంగా ముఖంలో నీరసం పోయి సహజ కాంతితో తాజాగా ఉండేలా చేస్తుందని వివరించారు. ఇంకా టాక్సిన్స్ బయటకు పోయేలా చేసి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుందని అంటున్నారు.

బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది: చాలా మందిని వేధించే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. అయితే, రెగ్యులర్​గా వాకింగ్ చేయడం వల్ల ముఖ్యంగా వేగంగా నడవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుందని వివరించారు.

అలసట పోయి ఉత్సాహం: వాకింగ్ చేయడం వల్ల అలసట తగ్గి శరీరాన్ని ఉత్తేజపరుస్తుందని వివరించారు. ఇంకా శరీర శక్తి సామర్థ్యాలు పెరిగి చురుకుగా, ఉత్సాహంగా ఉంటారని చెబుతున్నారు.

బ్యాలెన్సింగ్ పెరుగుతుంది: వాకింగ్ వల్ల బ్యాలెన్స్, కండరాల సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ప్రతి శరీర భాగం అవసరమైన మోతాదులో బరువు ఉండి అందంగా కనిపిస్తారని వివరించారు.

ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది: వాకింగ్ చేయడంతో కీళ్లు, కండరాలు ఫ్లెక్సబుల్​గా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రోజువారీ పనుల్లో కాళ్లు అసౌకర్యంగా ఉండి నొప్పులు రాకుండా చేస్తుందని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? నడకతో ప్రయోజనాలు తెలిస్తే షాక్!

మీరు వాకింగ్ చేస్తున్నారా? రోజు 20వేల అడుగులు నడిస్తే ఏమవుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.