national

ఎస్సారెస్పీలోకి వ్యర్థ జలాలు - ఆకుపచ్చగా మారుతున్న నీరు

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 4:31 PM IST

CONTAMINATED WATER IN SRIRAMSAGAR
Contaminated water in SRSP (ETV Bharat)

Contaminated water in SRSP : నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కలుషిత నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఎగువ భాగంలో గల మహారాష్ట్రకు చెందిన వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలను గోదావరి నదిలోకి విడుదల చేస్తుండడంతో, క్రమంగా ఆనీరంతా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో పాటు దుర్వాసన వస్తోంది. ప్రాజెక్టులో అనేక మత్స్య సంపదకు హాని కలుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీటికి వివిధ గ్రామాలకు సరఫరా అవుతోంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని దీనిపై చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మహారాష్ట్ర పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను గోదావరిలోకి వదలకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details