ఆర్థిక సమస్యలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Published : Sep 8, 2024, 2:28 PM IST
Constable Suicide Due to Financial Issues :సికింద్రాబాద్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరసింహ రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శనివారం రాత్రి సమయంలో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌కు వచ్చి తన బైక్ నిలిపి ట్రాక్ వైపు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. రాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ నరసింహా రాజు అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.