national

బోనాల పండుగకు సీఎం రేవంత్ సహకారం అభినందనీయం : ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్​పర్సన్

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 12:20 PM IST

Mahankali Temple In Old City
Mahankali Temple In Old City (ETV Bharat)

Mahankali Temple In Old City :హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపుర పరిధిలోని శ్రీ మహంకాళి మాతేశ్వరి అమ్మవారిని ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్​పర్సన్ కల్వ సుజాత దర్శించుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, ప్రజలకు సుపరిపాలన అందాలని, అందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.

బోనాల జాతర అంటే తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. అమ్మవారి దర్శనానికి తనను ఆహ్వానించడం పట్ల సుజాత ఆలయ కమిటీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక ఆర్య వైశ్య సంఘం నేతలు ఆమెను సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details