Young Man Suicide: ప్రేమించిన యువతి తిరస్కరించిందని ఓ యువకుడు పురుగుల మందు తాగిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సిర్నాపల్లికి చెందిన హోన్నాజీపేట్ అజయ్ (21) హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చదివి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. కానీ ఆ యువతి అజయ్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్, ఈ నెల 10వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగుతూ వీడియో తీసి యువతికి పంపించాడు. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు.
ప్రేమించిన యువతి నో చెప్పిందని - పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
YOUNG MAN SUICIDE IN NIZAMABAD (అజయ్) (ETV Bharat)
Published : Sep 26, 2024, 12:59 PM IST
తరచూ వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం 13న మండల కేంద్రంలోని దవాఖానాకు, అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు. 14న అజయ్ సెల్‌ఫోన్‌ను సోదరి చూడగా, విషయం తెలిసింది. చికిత్స పొందుతూ అజయ్ 24న మృతి చెందగా, ఘటనపై కుటుంబ సభ్యులు 25న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.