national

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 10:20 AM IST

ETV Bharat / snippets

తొలి మ్యాచ్​లోనే షాక్​ - 58 పరుగులకే కుప్పకూలిన ఉగాండా

UGA VS AFG T20 World Cup
UGA VS AFG T20 World Cup (Associated Press)

UGA VS AFG T20 World Cup :టీ20 ప్రపంచకప్​లో భాగంగా తాజాగా ఉగండా, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్ జట్టు భారీ స్కోర్​తో విజయం సాధించింది. ఉగండాపై 125 పరుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన అఫ్గాన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఉగాండా జట్టు, అఫ్గాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడి 16 ఓవర్లకు 58 పరుగుల మాత్రమే చేయగలిగింది. లెఫ్టార్మ్ సీమర్ ఫజల్ హక్ ఫరూఖీ 5 వికెట్లతో ఉగాండాను చిత్తు చేశాడు. ఇక నవీనుల్ హక్ 2, కెప్టెన్ రషీద్ ఖాన్ 2, ముజీబ్ ఒక్క వికెట్ తీశారు.

ఇదిలా ఉండగా, ఉగాండా జట్టులో రాబిన్సన్ ఒబుయా(14), రియాజత్ అలీ షా (11) మాత్రమే రెండెకల స్కోర్ చేయగలిగారు. వీరిద్దరు తప్ప మిగతా అందరూ సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details