ETV Bharat / snippets

నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డ్ - T20ల్లో అరుదైన ఘనత

author img

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

Nicholas Pooran Record
Nicholas Pooran Record (Source : Getty Images)

Nicholas Pooran Breaks Rizwan's Record: వెస్టిండీస్‌ స్టార్ హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2024లో ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్​ల్లో 2059 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (2036 పరుగులు) రికార్డును బద్దలుకొట్టాడు.

ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడుతున్న పూరన్ శుక్రవారం శుక్రవారం బార్బడోస్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులు బాదాడు. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. పూరన్ ఈ ఏడాది ఐపీఎల్​లో లఖ్​నవూకు ప్రాతినిధ్యం వహించిన పూరన్ 499 పరుగులతో సత్తా చాటాడు. ఇక 2024లో వెస్టిండీస్​​ సహా పలు టీ20 టోర్నీల్లో పూరన్ అద్భుతంగా రాణించాడు.

టీ20ల్లో ఏడాదిలో అత్యధిక పరుగులు

నికోలస్ పూరన్2059* పరుగులు2024
మహ్మద్ రిజ్వాన్2036 పరుగులు 2021
అలెక్స్‌ హేల్స్1946 పరుగులు2022
జాస్ బట్లర్1833 పరుగులు2023
మహ్మద్ రిజ్వాన్‌1817 పరుగులు2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.