Ind vs Ban T20 Series 2024 : బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ టీమ్ఇండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి మరోసారి టీమ్ఇండియా పిలుపు అందింది. ఇటీవల జింబాబ్వే పర్యటనకు నితీశ్ తొలిసారి ఎంపికైనప్పటికీ గాయం కారణంగా ఆ సిరీస్‌కు దూరమయ్యాడు.
తొలి పిలుపు
2024 ఐపీఎల్లో వేగవంతమైన బంతులు సంధించిన యంగ్ పేసర్ మయంక్ యాదవ్‌కు తొలిసారి టీమ్ఇండియా పిలుపు అందింది. గత ఐపీఎల్లో మయంక్ ఏకంగా గంటకు 150kpmh వేగంతో బంతులు విసిరి ఔరా అనిపించాడు. ఇక ఈ సీరిస్తో అతడు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత జాతీయ జట్టుక ఎంపికయ్యాడు. అతడు 2021లో స్కాట్లాండ్పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
NEWS 🚨 - #TeamIndia’s squad for T20I series against Bangladesh announced.
— BCCI (@BCCI) September 28, 2024
More details here - https://t.co/7OJdTgkU5q #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/DOyz5XGMs5
వీళ్లకు నిరాశే!
యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌తోపాటు బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. బంగ్లాతో సిరీస్‌కు ఈ ఇద్దరినీ ఎంపిక చేయలేదు. ఇక సంజు శాంసన్, జితేశ్ శర్మ వికెట్ కీపర్లుగా జట్టులోకి వచ్చారు.
కాగా, భారత్ - బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 06న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అందులో గ్వాలియర్, న్యూ దిల్లీ, హైదరాబాద్ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.
సిరీస్ షెడ్యూల్
తొలి టీ20 | అక్టోబర్ 06 | గ్వాలియర్ |
రెండో టీ20 | అక్టోబర్ 09 | న్యూ దిల్లీ |
మూడో టీ20 | అక్టోబర్ 12 | హైదరాబాద్ |
భారత్ జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్
భారత్ x బంగ్లాదేశ్ - రెండో రోజు వాష్ ఔట్ - India Vs Bangladesh 2nd Test