ETV Bharat / offbeat

"మైసూర్​ స్టైల్​ టమాటా రసం" - రుచి అమోఘంగా ఉంటుంది! - ఇలా ప్రిపేర్ చేయండి! - Mysore Tomato Rasam - MYSORE TOMATO RASAM

Mysore Tomato Rasam Recipe : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చారు, రసంలాంటివి ఉంటే ఆ భోజనం అద్భుతంగా ఉంటుంది. అలాగని రోజూ ఒకటే తీరు రసం చేసుకుంటే స్పెషల్ ఏమీ ఉండదు. అందుకే.. ఈసారి మైసూర్​ స్టైల్ టమాటా రసం ట్రైచేయండి. రుచికి తప్పకుండా ఫిదా అయిపోతారు.

Mysore Tomato Rasam Recipe
Mysore Tomato Rasam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 11:47 AM IST

How To Prepare Mysore Tomato Rasam : చాలా మందికి భోజనంలోకి ఎన్ని కూరలు, వేపుళ్లు ఉన్నా.. కాస్త రసంతో తింటేనే తృప్తిగా ఉంటుంది. అందుకే టమాటా రసం, మిరియాల రసం వంటివి చేసుకుంటారు. అయితే, టమాటా రసంలో కూడా చాలా రకాలున్నాయి. దీనిని ఒక్కోచోట ఒక్కో టేస్ట్​తో ప్రిపేర్​ చేస్తుంటారు. కాబట్టి ఈసారి మీ ఇంట్లో టమాటా రసం చేయాలనుకుంటే.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా మైసూర్​ స్టైల్లో చేసేయండి. ఈ రసం చేయడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. పైగా టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. ఎలా చేయాలో ఓ లుక్కేయండి!

కావాల్సిన పదార్థాలు :

  • కందిపప్పు- నాలుగు టేబుల్​ స్పూన్లు
  • చింతపండు- నిమ్మకాయసైజంత
  • టమాటాలు -4
  • పచ్చిమిర్చి - 4
  • బెల్లం- టేబుల్​స్పూన్​
  • కరివేపాకు
  • పసుపు - చిటికెడు
  • నూనె
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కొద్దిగా కొత్తిమీర తరుగు

రసం పొడి కోసం..

  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • పచ్చి శనగపప్పు- టేబుల్​స్పూన్​
  • పచ్చికొబ్బరి- పావుకప్పు
  • మిరియాలు- టీస్పూన్​
  • బ్యాడిగి మిర్చి-3
  • ధనియాలు- టేబుల్​స్పూన్
  • జీలకర్ర- అర టీస్పూన్​

తాళింపు కోసం..

  • జీలకర్ర-టీస్పూన్​
  • నెయ్యి-టేబుల్​స్పూన్​
  • ఆవాలు-టీస్పూన్
  • ఎండుమిర్చి-2
  • ఇంగువ- అరటీస్పూన్​

టమాటా రసం తయారీ విధానం :

  • ముందుగా కందిపప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి.. అరగంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత కుక్కర్లో కందిపప్పు వేసుకుని నీళ్లు పోసుకుని సన్నని మంటమీద రెండు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోండి. పప్పు ఉడికిన తర్వాత మూత తీసి మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • అలాగే మరొక స్టౌపై​ పాన్​ పెట్టి ఆయిల్​ పోసి బ్యాడిగి మిర్చి, పచ్చి శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఇందులోనే పచ్చికొబ్బరి వేసి సన్నని మంట మీద మంచి అరోమా వచ్చేవరకు ఫ్రై చేసుకోండి. మీకు అచ్చం మైసూర్​ స్టైల్​ రసం రుచి​ రావాలంటే కచ్చితంగా బ్యాడిగి మిర్చి వాడాలి. ఇవి సూపర్​ మార్కెట్లో దొరుకుతాయి. మీ దగ్గర బ్యాడిగి మిర్చి లేకపోతే ఎండు మిర్చిలను వాడుకోవచ్చు.
  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి​ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
  • ఇప్పడు ఓ గిన్నెలో తీసుకుని అందులోకి కట్​ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, బెల్లం, పసుపు వేసుకుని.. మెత్తగా చిదుముకోవాలి. అంటే టమాటాలలోని సారం మొత్తం వచ్చేంత వరకు చేతితోనే మెదుపుకోవాలి.
  • అలాగే ఇందులోకి చింత పండు, కరివేపాకులు వేసుకుని మరొక సారి మెదుపుకోవాలి.
  • ఇప్పుడు ఆ టమాటా రసాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులో లీటర్​ వాటర్​ పోయండి. అలాగే పచ్చిమిర్చిలు వేసి సన్నని మంట మీద రసం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి.
  • మరుగుతున్న టమాటా రసంలో ఉడికించిన పప్పు, గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి వేసి, కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్​ మీద మరో నాలుగు నిమిషాలు మరిగించాలి. తర్వాత సన్నని మంట మీద రసాన్ని మరిగించుకోవాలి.
  • మరోపక్క తాళింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు తాళింపును మరుగుతున్న రసంలో వేసి మరో పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే.. అంతే ఘుమఘుమలాడే మైసూర్​ రసం రెడీ.
  • ఒక్కసారి ఈ మైసూర్​ స్టైల్​ రసంతో తిన్నారంటే.. రెండు ముద్దలు ఎక్కువే తింటారు. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ రసం ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

వర్షాకాలంలో "పచ్చి పులుసు" ఇలా చేస్తే - టేస్ట్​ గురించి చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే!

సూపర్ టేస్టీ : 10 నిమిషాల్లో టమాటా మిరియాల రసం - ఇలా ప్రిపేర్ చేస్తే ఒట్టి రసం కూడా తాగేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.