This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. మరి వీకెండ్ వచ్చిందంటే ఓ ఓటీటీలో ఏ కొత్త సినిమా, వెబ్ సిరీస్ వచ్చిందో అని తెగ వెతికేస్తుంటారు సినీ ప్రియులు. అందుకే ఆయా ఓటీటీ సంస్థలు కూడా సరికొత్త కంటెంట్‌తో ముందుకొస్తుంటాయి. అలా ఈ వారం మిమ్మల్ని అలరించడానికి తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వచ్చేశాయి. మరి ఇంతకీ కొత్తగా వచ్చిన ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.
థియేర్లో దేవర - ఈ వీకెండ్లో థియేటర్లలో అందుబాటులో ఉన్న ఏకైక చిత్రం 'దేవర'. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. తొలి రోజు రూ.140 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో - నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం నేచురల్ స్టార్ నాని నటించిన బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం(Saripoda Sanivaram OTT) స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్లలో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్‌లోనూ మంచి విశేష ఆదరణ దక్కించుకుంది.
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ఉలఝ్ అనే హిందీ చిత్రం కూడా శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహా ఓటీటీలో - ఆహా ఓటీటీలోకి ఈ వారం రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మలయాళ డబ్బింగ్ మూవీ చాప్రా మార్డర్ కేస్, నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 అందుబాటులో ఉన్నాయి. ఆహా తమిళం ఓటీటీలో కాఫీ అనే తమిళ చిత్రం విడుదలైంది.
జీ5 ఓటీటీలో - జీ5 ఓటీటీలోకి కూడా రెండు ఆసక్తికరమైన చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తమిళ హారర్ మూవీ డీమాంటే కాలనీ 2(Demont Colony 2 OTT) తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. శోభిత ధూళిపాళ్ల నటించిన లవ్, సితార చిత్రం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం హిందీ వెర్షన్లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రైమ్ వీడియో ఓటీటీలో - అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఏకంగా మూడు చిత్రాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ కామెడీ స్త్రీ 2(Stree 2 Movie OTT) ప్రైమ్ వీడియోలో అద్దె ప్రతిపాదికన అందుబాటులో ఉంది. అజయ్ దేవగన్ ఔరో మే కహా దమ్ థా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ హిట్ చిత్రం కొట్టుక్కాలి కూడా అందుబాటులో ఉంది.
ఇంకా ఈటీవీ విన్ ఓటీటీలో ఆర్టీఐ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తాజాకబర్ వెబ్ సిరీస్ సీజన్ 2, జియో సినిమాలో హనీమూన్ ఫొటోగ్రాఫర్ అనే హిందీ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ చిత్రాలన్నింటిలో సరిపోదా శనివారం, డిామంట్ కాలనీ, స్ట్రీ 2 చిత్రాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
'దేవర' ఓపెనింగ్స్ - కళ్లు చెదిరే వసూళ్లు! - ఏకంగా ఎన్ని కోట్లంటే? - Devara First Day Collections
బెస్ట్ యాక్టర్‌గా నాని - చిరంజీవి, బాలయ్యకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు - IIFA Utsavam 2024