ETV Bharat / state

'ఇంటి మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు' - CM On Family Digital Health Cards - CM ON FAMILY DIGITAL HEALTH CARDS

CM Revanth Review On Family Digital Health Cards : కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ప్రస్తుతం కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు.

Family Digital Health Cards In Telangana
CM Revanth Review On Family Digital Health Cards (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 10:24 PM IST

CM Revanth Review On Family Digital Health Cards : కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ప్రస్తుతం కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి అనవసర సమాచారం సేకరించవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు.

మహిళే యజమానిగా హెల్త్ కార్డులు : మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్డు వెనకాల కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు ఉండాలని సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈనెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు అధ్యయనాల వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేన్ ద్వారా సీఎంకు తెలిపారు.

కార్డులు ఇచ్చిన ఇత‌ర రాష్ట్రాల్లోని ఉపయోగకరమైన అంశాల‌ను స్వీక‌రించాలని సీఎం సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డుల్లో ఏయే వివరాలు ఉండాలని అప్ డేట్ ఎలా చేసుకోవాలనే వివరాలను రేపు సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం సూచ‌న‌ల మేర‌కు మార్పులు, చేర్పులు చేసి తుది నివేదిక తయారు చేయాలన్నారు.

ఇంటింటి పరిశీలన : పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రామాలు పూర్తిగా పట్టణ ప్రాంతాలున్న చోట రెండు వార్డులు లేదా డివిజ‌న్లలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలని సీఎస్​కు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఇటీవ‌ల వ‌ర‌ద‌ల స‌మ‌యంలో పనిచేసిన సీనియ‌ర్ అధికారుల‌ను పర్యవేక్షకులుగా నియమించాలన్నారు. క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న స‌మ‌గ్రంగా క‌చ్చిత‌త్వంతో చేప‌ట్టాల‌ని, ఎటువంటి లోపాల‌కు తావులేకుండా చూడాల‌ని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పొన్నం ప్రభాకర్, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త - ఇక టూర్‌లకు ఫ్రీగా వెళ్లొచ్చు - HYDERABAD TOURISM DEVELOPMENT

30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌కార్డులను తీసుకువస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth On Digital Health Cards

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.