ETV Bharat / snippets

లబూషేన్ వరల్డ్​ రికార్డ్ - తొలి క్రికెటర్​గా అరుదైన ఘనత​

author img

By ETV Bharat Sports Team

Published : Sep 20, 2024, 5:41 PM IST

Marnus Labuschagne
Marnus Labuschagne (Source : Associated Press)

Marnus Labuschagne ODI Record:ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. వన్డే చరిత్రలో ఒకే మ్యాచ్​లో 50+ పరుగులు, 3 వికెట్లు, 4 క్యాచ్​లు సాధించిన ఏకైక క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న వన్డే సిరీస్​లో తొలి మ్యాచ్​లో లబూషేన్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు.

తొలి ఇన్నింగ్స్​లో బౌలింగ్​ చేసిన లబూషేన్ 6 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. అందులో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, ఆర్చర్​ను పెవిలియన్​కు పంపాడు. అలాగే ఇదే ఇన్నింగ్స్​లో డకెట్, బ్రూక్, జకాబ్, ఆదిల్ రషీద్ ఇచ్చిన క్యాచ్​లు అందుకున్నాడు. ఇక ఛేజింగ్​లో మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు దిగిన అతడు 61 బంతుల్లోనే 77 పరుగులతో రాణించాడు. దీంతో వన్డేల్లో ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్​గా నిలిచాడు. కాగా, మ్యాచ్​లో ఆస్ట్రేలియా 7వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 44 ఓవర్లలోనే ఛేదించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.