ETV Bharat / sports

క్రికెటర్లకు BCCI బంపర్ ఆఫర్- ఇకపై మ్యాచ్ ఫీజు రూ. 7.5 లక్షలు- కంప్లీట్ సీజన్​కు కోటిపైనే! - IPL 2025 Match Fee - IPL 2025 MATCH FEE

IPL 2025 Match Fee : ఐపీఎల్​ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2025 సీజన్​ నుంచి మ్యాచ్ ఫీజులు పెంచుతున్నట్లు నిర్ణయించింది.

IPL 2025 Match Fee
IPL 2025 Match Fee (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 28, 2024, 8:18 PM IST

IPL 2025 Match Fee: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే ప్లేయర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై లీగ్​ మ్యాచ్​ ఫీజులు పెంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 2025 ఐపీఎల్​ నుంచి లీగ్​లో ఆడే ఒక్కో మ్యాచ్​కు ప్లేయర్లు రూ. 7.5 లక్షలు ఫీజుగా అందుకోనున్నారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు.

'ఐపీఎల్​ మ్యాచ్ ఫీజులు పెంచుతున్నామని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా క్రికెటర్లు ఇప్పటి నుంచి ఒక్కో మ్యాచ్​కు రూ.7.5 లక్షల ఫీజు అందుకోనున్నారు. కాంట్రాక్ట్ డబ్బుతో అదనంగా, సీజన్​లో అన్ని మ్యాచ్​లు ఆడినట్లైతే ఒక్కో ప్లేయర్​కు అత్యధికంగా రూ. 1.05 లక్షలు ఫీజు రూపంలో అందుతుంది. ఇందుకోసం అన్ని ఫ్రాంచైజీలు రూ. 12.60 కోట్లు మ్యాచ్​ ఫీజుల కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. ఐపీఎల్​కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం' అని జై షా ట్వీట్​లో రాసుకొచ్చారు. కాగా, గతంలో ఒక్కో మ్యాచ్​కు ఫీజు రూ. 2 - 4 లక్షల మధ్యలో ఉండేది.

IPL 2025 Retention Rules : ఇక ఐపీఎల్ మెగా వేలం, రిటెన్షన్ రూల్స్​పై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్కో జట్టు ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేలా, ఒక రైట్ టు మ్యాచ్ కార్డు కూడా బీసీసీఐ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎలాంటి షరతులు లేకుండా స్వదేశీ, విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు ఫ్రాంచైజీలకు వీలు కల్పించనుందని సమాచారం. ఈ మేరకు తాజాగా జరిగిన బీసీసీఐ జనరల్ మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సారి కూడా 74 మ్యాచ్ లే!
అయితే ఈసారి కూడా టోర్నీలో 74 మ్యాచ్​లే ఉండనున్నాయి. గతంలో బీసీసీఐ 2023 - 27 ఐపీఎల్ సీజన్ వరకు మీడియా హక్కులను విక్రయించింది. ఈ క్రమంలో 2023, 2024లో ఒక్కొ సీజన్​లో 74 మ్యాచ్​లు, 2025, 2026లో 84 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 2027లో ఏకంగా 94 మ్యాచ్​ ఆడించనున్నట్లు తెలిపింది. కానీ, వచ్చే ఏడాది అంటే 2025 ఐపీఎల్ లో 84 మ్యాచ్‌ లకు బదులు 74 మ్యాచ్‌లే ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.

BCCI కీలక నిర్ణయం తీసుకుందా? 2025 IPLలో మ్యాచ్​ల పెంపు లేనట్లేనా? - IPL 2025

మెగా వేలంలోకి 5 స్టార్‌ ప్లేయర్స్!​ - ఏ ఫ్రాంఛైజీ ఎవరిని వదులుకుంటుందంటే? - IPL 2025 Mega Auction

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.