ETV Bharat / politics

అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు : జేపీ నడ్డా - JP Nadda Review On BJP Membership

JP Nadda Review On BJP Memberships : అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పార్టీశ్రేణులకు స్పష్టం చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ నాయకులతో జేపీ నడ్డా సమీక్షించారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు.

JP Nadda Review On BJP Memberships
JP Nadda Review On BJP Memberships (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 8:34 PM IST

JP Nadda Attended BJP Membership Meeting : 15 రోజుల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బేగంపేట హరితాప్లాజాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు సమావేశానికి జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటిస్తున్న జేపీ నడ్డా ఇవాళ ఉదయం బీహార్​లో సభ్యత్వ నమోదు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3: 30కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు రాష్ట్ర పదాధికారులతో భేటీ అయ్యారు.

విభేదాలు లేకుండా సమన్వయంతో పనిచేయండి : రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై జేపీ నడ్డా ఆరా తీశారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 77 లక్షల ఓట్లు, ఎనిమిది సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 77లక్షల ఓట్లు వచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదని అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.

నేతల మధ్య విభేదాలు లేకుండా సమన్వయంతో సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం అంశాలపైన అరా తీసినట్లుగా సమాచారం. అంతకు ముందు హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ ముఖ్యనాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్​కు ఇటీవలే బీజేపీ సభ్యత్వ నమోదు ఇంఛార్జి అభయ్ పాటిల్ సందర్శించారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆయన పార్టీశ్రేణులతో చర్చించారు.

నేడు హైదరాబాద్‌కు జేపీ నడ్డా - తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చ

టార్గెట్​ రీచ్​ కాకపోతే పదవులు ఊడతాయ్ - పార్టీ సభ్యత్వంపై బీజేపీ శ్రేణులకు వార్నింగ్​ - Abhay Patil Warning to BJP Cadre

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.