SA vs WI Test Series:టెస్టు ఫార్మాట్లో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. విండీస్‌లో పర్యటిస్తున్న సౌతాఫ్రికా, తాజాగా ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో సఫారీ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్ నెగ్గిన సౌతాఫ్రికా టెస్టుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. టెస్టుల్లో ఒకే ప్రత్యర్థిపై వరుసగా 10 సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా ఘనత సాధించింది.
Published : Aug 18, 2024, 7:14 PM IST
సౌతాఫ్రికా వరల్డ్ రికార్డ్- భారత్, ఆసీస్‌ను అధిగమించి!
SA vs WI (Source: Getty Images)
కాగా, అంతకుముందు చెరో 9 విజయాలతో ఈ రికార్డ్ భారత్, ఆస్ట్రేలియా పేరిట ఉంది. అయితే భారత్, ఆసీస్ కూడా విండీస్‌పైనే ఈ రికార్డు నెలకొల్పాయి. ఇక సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 33 టెస్టులు జరిగాయి. ఇందులో సఫారీ జట్టు మూడింట్లో మాత్రమే ఓడింది. ఈక్రమంలో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు (171) పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్‌గా నిలిచాడు.