ETV Bharat / politics

పార్టీని పటిష్టం చేసే దిశగా బీఆర్​ఎస్​ అడుగులు - ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్ - BRS ON MLAs DEFECTED CONSTITUENCIES

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 40 minutes ago

BRS On Party Changed MLAs Constituencies : ఫిరాయించిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్‌ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉపఎన్నికలు తప్పవన్న భావనలో ఉన్న గులాబీ పార్టీ ఆ దిశగా నేతలను సన్నద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించనుంది. ఇవాళ శేరిలింగంపల్లితో ప్రారంభించి ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

BRS on Defected Constituencies
BRS on Defected Constituencies (ETV Bharat)

BRS on MLAs Defected Constituencies : శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పదిమంది ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిని వీడారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మొదలు వివిధ సందర్భాల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిపై శాసనసభాపతి వద్ద ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ న్యాయపరంగా కూడా పోరాటాన్ని ప్రారంభించింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్ల విచారణకు సంబంధించి నాలుగు వారాల్లోగా షెడ్యూలు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.

పది నియోజకవర్గాల్లో ఉపఎన్నిక ఖాయం : హైకోర్టు ఆదేశాల అనంతరం జరగబోయే పరిణామాలను బేరీజు వేసుకొని అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి న్యాయపోరాటం చేయాలని పార్టీ భావిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం మూడు నెలల్లోగా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని, పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ పదేపదే చెబుతోంది. పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు, శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆ పది నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది.

ప్రభుత్వానికి కూల్చివేత తప్ప పూడ్చివేత చేతకాదు : హరీశ్​రావు - Harish Rao Slams Congress Govt

నేతలు కార్యకర్తలతో సమన్వయం : ఫిరాయింపు ఎమ్మెల్యేల వెంట వెళ్లకుండా పార్టీలో మిగిలిన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని కార్యక్రమాలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలతో పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో రెండు రోజుల క్రితం సమావేశమై త్వరలోనే విసృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పది నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు.

మొదటగా శేరిలింగంపల్లి నియోజకవర్గ నేతలతో ఆయన మంగళవారం సమావేశం కానున్నారు. నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ తరపున కార్యక్రమాల నిర్వహణ, ఉపఎన్నికలకు సన్నద్ధత అంశాలపై వారికి వివరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. పది నియోజకవర్గాల్లో నేతలను ఉపఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ పడింది.

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి - తీవ్రంగా ఖండించిన బీఆర్‌ఎస్‌ - MLA Sunita House Attack Controversy

రాష్ట్రంలో రేవంత్​ రెడ్డి 'సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం' నడుస్తోంది : కేటీఆర్​ - ktr slams cm revanth reddy

Last Updated : 40 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.