Modi Meets Ukrainian President Zelenskyy : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రష్యాతో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు భారత్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. శాంతి స్థాపన కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి భారత్ ఎప్పుడూ సుముఖంగా ఉంటుందని చెప్పినట్లు 'ఎక్స్' వేదికగా మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, గత నెలలో కీవ్ పర్యటన చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి, రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. గత మూడు నెలల వ్యవధిలో మోదీ-జెలెన్‌స్కీల మధ్య జరిగిన మూడో సమావేశం ఇది. ఈ సమావేశం తరువాత మోదీ భారత్కు తిరుగు ప్రయాణం అయ్యారు. మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించి శాంతి పునరుద్ధరణకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Met President @ZelenskyyUa in New York. We are committed to implementing the outcomes of my visit to Ukraine last month to strengthen bilateral relations. Reiterated India’s support for early resolution of the conflict in Ukraine and restoration of peace and stability. pic.twitter.com/YRGelX1Gl5
— Narendra Modi (@narendramodi) September 23, 2024
నేపాల్, పాలస్తీనా అధినేతలతో మోదీ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్, పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఐరాస సర్వప్రతినిధి సభకు హాజరయ్యేందుకు వచ్చిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌లతో ఆయన విడివిడిగా సమావేశమై సమాలోచనలు జరిపారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.
"భారత్-నేపాల్ స్నేహబంధం ఎంతో బలీయమైనది. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంధనం, సాంకేతికత, వాణిజ్య రంగాలపై తాజా చర్చల్లో మేం దృష్టి సారించాం" అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదిక ద్వారా తెలిపారు. పరస్పర ఆసక్తిదాయక అంశాలపై, భాగస్వామ్య విస్తరణపై చర్చలు సాగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తమ దేశంలో పర్యటించాలని ఓలి ఆహ్వానించగా మోదీ అంగీకరించారు.
Had a very good meeting with Prime Minister KP Oli in New York. The India-Nepal friendship is very robust and we look forward to adding even more momentum to our ties. Our talks focused on issues such as energy, technology and trade. @kpsharmaoli pic.twitter.com/WGrSrL8mEO
— Narendra Modi (@narendramodi) September 23, 2024
గాజాలో మానవతపరమైన సంక్షోభంపై పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ వద్ద మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ సహకారం ఇకపైనా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
Met President Mahmoud Abbas in New York. Reiterated India’s support for early restoration of peace and stability in the region. Exchanged views of further strengthening long standing friendship with the people of Palestine. pic.twitter.com/LnmAm7dDax
— Narendra Modi (@narendramodi) September 23, 2024
కువైట్ యువరాజు షేక్ సబా ఖాలిద్ అల్ సబాతోనూ ఆయన భేటీ అయి, రెండు దేశాల మధ్య చారిత్రక అనుబంధాన్ని, ప్రజల మధ్య స్నేహపూరిత బంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు.
The talks with His Highness Sheikh Sabah Khaled Al-Hamad Al-Sabah, the Crown Prince of Kuwait, were very productive. We discussed how to add vigour to India-Kuwait ties in sectors like pharma, food processing, technology, energy and more. pic.twitter.com/MKmjlNglm3
— Narendra Modi (@narendramodi) September 23, 2024
'సమష్టి శక్తిలోనే మానవాళి విజయం'- ఐరాసలో మోదీ స్పీచ్ - PM Modi At United Nations
'భారత్ అవకాశాల స్వర్గం - డిజిటల్ విప్లవంలో ఇండియా దూసుకెళుతోంది' - మోదీ - Modi US Visit