ETV Bharat / snippets

మళ్లీ నిరాశపర్చిన అయ్యర్- ఈసారి డకౌట్

author img

By ETV Bharat Sports Team

Published : Sep 13, 2024, 12:02 PM IST

Shreyas Iyer Duleep Trophy
Shreyas Iyer Duleep Trophy (Source: Getty Images)

Shreyas Iyer Duleep Trophy 2024:2024 దులీప్ ట్రోఫీలో యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరశపర్చాడు. రెండో రౌండ్​ ఇండియా ఎ తో జరుగుతున్న మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన అయ్యర్ డకౌట్ అయ్యాడు. వన్ డౌన్​లో బ్యాటింగ్​కు వచ్చిన అయ్యర్ ఏడు బంతులు ఆడి, పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 2.4 ఓవర్ వద్ద ఖలీల్ అహ్మద్ బౌలింగ్​లో క్యాచౌట్​గా వెనుదిరిగాడు. కాగా, తొలి రౌండ్​లో ఇండియా సితో మ్యాచ్​లో అయ్యర్ (9 పరుగులు), (54 పరుగులు) చేశాడు.

అయితే తొలి మ్యాచ్​లో హాఫ్ సెంచరీ చేసిన అయ్యర్ ఎదుర్కొంది 44 బంతులే. దీంతో టెస్టుల్లో టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలంటే అయ్యర్ మరింత శ్రమించాల్సిదే! ఇకనైనా భారీ ఇన్నింగ్స్​తో రాణించాల్సిన అవసరం ఉంది. కాగా, ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో ఇండియా 290-10 పరుగులకు ఆలౌటైంది. ఇండియా డి 26 ఓవర్లకు 81-4తో పోరాడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.