national

ETV Bharat / snippets

నిన్న చెత్త రికార్డు- నేడు ఊచకోత- అభిషేక్ శర్మ గట్టి రివెంజ్!

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 5:40 PM IST

Abhishek Sharma India Vs Zimbabweat
Abhishek Sharma (Associated Press)

Abhishek Sharma India Vs Zimbabwe :ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య జరిగిన రెండో మ్యాచ్​లో యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఈ సిరీస్​లో శతకం బాది తన తొలి ఇంటర్నేషనల్ సెంచరీని నమోదు చేశాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో ఈ రికార్డును సాధించాడు. అయితే 100 తర్వాత డియాన్ మయర్స్ చేతికి చిక్కి పెవిలియన్ బాటపట్టాడు. ముఖ్యంగా మయర్స్ వేసిన 11 ఓవర్లో వరుస సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో వరుసగా 2, 4,6,4,6,4 పరుగులు సాధించాడు. దీంతో ఈ ఒక్క ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details