ETV Bharat / snippets

ఆసీస్ శుభారంభం- చిత్తుగా ఓడిన లంక

author img

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

T20 World Cup
T20 World Cup (Source: Associated Press)

SL W vs AUS W T20 World Cup: 2024 మహిళల టీ20 వరల్డ్​కప్​లో డిఫెండింగ్ ఛాంప్​ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక నిర్దేశించిన 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 14.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బెత్ మూనీ (43 పరుగులు) ఆకట్టుకుంది. లంక బౌలర్లలో ప్రభోదిని, రణవీర, సుగంధిక కుమారి తలో వికెట్ దక్కించుకున్నారు. మూడు వికెట్లతో సత్తాచాటిన ఆసీస్ బౌలర్ మెగన్ సుచుత్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్లోయి 93 పరుగులకే పరిమితమైంది. నీలాక్షి (29* పరుగులు) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలింగ్ ముంగిట లంక ప్లేయర్లు నిలువలేకపోయారు. సగం మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్​కే పరిమితమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.