Apple Stores in India: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. త్వరలోనే మరో 4 యాపిల్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో ఐఫోన్16 సిరీస్ తయారీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించింది.
25శాతం ఐఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే..!:
- ఇండియాలో తమ స్టోర్లను పెంచడంపై యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్‌డ్రే ఓబ్రియన్ ఆనందం వ్యక్తం చేశారు.
- బెంగళూరు, పుణె, దిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో కొత్త స్టోర్లు తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
- ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించినట్లు యాపిల్ తెలిపింది.
- త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
- వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎగుమతులు చేయనున్నట్లు పేర్కొంది.
- రానున్న మరి కొన్నేళ్లలో 25శాతం ఐఫోన్ల ఉత్పత్తి ఇండియాలోనే చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.
మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్16 సిరీస్:
- ఐఫోన్16 సిరీస్.. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
- వచ్చే ఏడాదిలో కొత్త స్టోర్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
- ఇదిలా ఉండగా 2017లోనే యాపిల్ భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది.
- 2023 ఏప్రిల్‌లో దిల్లీ, ముంబయిలో 2 రిటైల్ స్టోర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.
యాపిల్ దీపావళి సేల్: యాపిల్ తన దీపావళి సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఐఫోన్లతో పాటు మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వంటి పలురకాల యాపిల్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోంది. ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో యాపిల్ ఈ డీల్ తీసుకొచ్చింది. ఎంపిక చేసిన వస్తువుల సేల్స్‌పై 3 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాక ఐఫోన్ 15 కొనుగోలు చేసినవారికి ఫ్రీగా బీట్స్ సోలో బడ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్కెట్లోకి ఒకేరోజు కియా లగ్జరీ కార్లు- ధర, ఫీచర్లు ఇవే..! - Kia Cars Launched in India
కొత్త అప్డేట్ ఇచ్చిన యూట్యూబ్- అదేంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..! - YouTube Big Update