Shivam Dube Ruled Out : బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న దూబే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దూబే స్థానాన్ని తెలుగు కుర్రాడు తిలక్ వర్మ భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. ఇక తిలక్ ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో టీమ్‌ఇండియాతో కలుస్తాడని బోర్డు పేర్కొంది. దీంతో బంగ్లాతో సిరీస్‌లో నితీశ్ రెడ్డితో సహా తెలుగు ప్లేయర్ల సంఖ్య రెండుకు చేరింది.
టీ20 కెరీర్
యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ 2023 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ ఆడాడు. అప్పుట్నుంచి ఇప్పటిదాకా తిలక్ 16 టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 139.42 స్ట్రైక్ రేట్‌తో 336 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోర్ 55 పరుగులు.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 5, 2024
Shivam Dube ruled out of #INDvBAN T20I series.
The Senior Selection Committee has named Tilak Varma as Shivam’s replacement.
Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank
ఓపెనింగ్ జోడీ ఫిక్స్
ఈ సిరీస్‌కు కేవలం ఒకే స్పెష్టలిస్ట్ ఓపెనర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అది అభిషేక్ శర్మ. అయితే అభిషేక్‌తో పాటు వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చని మొదట్నుంచి ప్రచారం సాగింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఉత్కంఠకు తెరదించాడు. అందరూ అనుకున్నట్లుగానే అభిషేక్‌తోపాటు శాంసన్ ఓపెనర్‌గా రానున్నాడని సూర్య వెల్లడించాడు.
షెడ్యూల్
తొలి టీ20 | అక్టోబర్ 06 | గ్వాలియర్ |
రెండో టీ20 | అక్టోబర్ 09 | న్యూ దిల్లీ |
మూడో టీ20 | అక్టోబర్ 12 | హైదరాబాద్ |
భారత్ జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్
బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టన్ కుమార్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మద్, తస్రీకిన్ అహ్మద్, తస్రీకిన్ అహ్మద్ , రకీబుల్ హసన్
సంజూ శాంసన్ ఖాతాలోకి అరుదైన ఘనత - 9 ఏళ్ల కెరీర్లో ఇదే తొలిసారి! - Sanju First Chance in 9 Years
బంగ్లాతో తొలి టీ20 తుది జట్టు - తెలుగు కుర్రాడికి నో ఛాన్స్! - IND VS BAN First T20