ETV Bharat / state

మెడికల్​ అడ్మిషన్లలో స్థానికత వివాదంపై వీడిన చిక్కుముడి - హైకోర్ట్​ కీలక ఆదేశాలు - HC On Telangana MBBS Admissions

రాష్ట్రంలో ఎంబీబీఎస్​​ అడ్మిషన్ల విషయంలో స్థానిక కోటాపై వీడిన చిక్కుముడి - హైకోర్ట్​ కీలక ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

HC Fires On Education Dept Over Contempt Of Court
High Court On Local Quota in Medical Admissions (ETV Bharat)

High Court On Local Quota in Medical Admissions : నిబంధనల ప్రకారం తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు నివాసం ఉండి, అర్హత పరీక్ష రాసినట్లయితే మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలంటూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి రాష్ట్రంలో ఉంటూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినా, స్థానిక కోటా కింద పరిగణించకపోవడాన్ని సవాలు చేస్తూ 32 ఏళ్ల అనమ్తా ఫరూక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

మెడికల్​ అడ్మిషన్లలో స్థానికత వివాదం : పిటిషనర్ 1998 నుంచి 2008 దాకా పదో తరగతి వరకు దుబాయ్‌లో చదువుకున్నారని, 2019లో తెలంగాణకు వచ్చి ఇక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. మే 5న జరిగిన నీట్ పరీక్షలకు హాజరయ్యారన్నారు. 4 ఏళ్ల స్థానిక నివాసానికి సంబంధించి జులై 17న శేరిలింగంపల్లి ఎమ్మార్వో జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని అందజేశామన్నారు. అయినా పిటిషనర్‌ను స్థానికేతర కోటా కింద చూపడం చెల్లదన్నారు.

ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం నిబంధనల ప్రకారం రాష్ట్రంలో వరుసగా 4 ఏళ్లు చదివి ఉండటంగానీ, నివాసంగానీ ఉండాలని, దీంతో పాటు నీట్ అర్హత పరీక్ష తెలంగాణలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. దీని ప్రకారం పిటిషనర్ 4 ఏళ్లు తెలంగాణలో నివాసం ఉండటంతో పాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించినందున మెడికల్ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

HC Fires On Education Dept Over Contempt Of Court : మరోవైపు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో సీఎస్సీలో సీట్ల పెంపునకు అనుమతించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాంతో పాటు మరో ఇద్దరికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీట్ల పెంపునకు అనుమతించకపోవడాన్ని కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించరాదో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూలు ఆమోదించిన ప్రకారం కంప్యూటర్ సైన్స్ తదితర కోర్సుల్లో సీట్ల పెంపునకు అనుమతించాలని, వాటి భర్తీకి తగిన ప్రణాళిక రూపొందించి, కౌన్సెలింగ్ నిర్వహించాలన్న సెప్టెంబరు 9న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై పలు ఇంజినీరింగ్ కళాశాలలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సీట్ల పెంపునకు అనుమతించాలంటూ ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఈ హైకోర్టు ఉత్తర్వులనే అత్యున్నత న్యాయస్థానం సమర్ధించిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా చేసింది.

ఎంబీబీఎస్​, బీడీఎస్​ ప్రవేశాల్లో స్థానికతను పక్కకు పెట్టి ఆన్​లైన్​ దరఖాస్తులు తీసుకోండి : హైకోర్టు - Telangana HC on MBBS Admissions

గుడి ముందు బెగ్గర్,​ 20ఏళ్ల తర్వాత డాక్టర్- ఈమె జర్నీ ట్రూలీ ఇన్స్​పిరేషనల్! - Beggar Become Doctor

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.