IPL Right To Match Rule Complaints : ఐపీఎల్ కొత్త నిబంధనలపై ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. రైటు టు మ్యాచ్‌తో పాటు రిటెన్షన్ విధానంలో ఆరుగురిని తమ దగ్గరే అట్టిపెట్టుకునే అవకాశాన్ని ఫ్రాంఛైజీలకు ఇచ్చింది బీసీసీఐ. అయితే ఆర్‌టీఎం(రైట్ టు మ్యాచ్) విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఫ్రాంఛైజీలు అంటున్నాయి. దీంతో ఐపీఎల్ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై ఫిర్యాదులు అందినట్లు సమాచారం అందింది. ముఖ్యంగా రైట్ టు మ్యాచ్ వల్ల తమపై అనవసరమైన వ్యయం పడుతుందన్న ఆందోళనను ఫ్రాంఛైజీలు వ్యక్తం చేస్తున్నాయట. కాబ్టటి ఈ నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి రైట్ టు మ్యాచ్ రూల్‌ను ప్రవేశ పెట్టిన ప్రారంభంలో ఆటగాడి కోసం అత్యధిక బిడ్‌ను దాఖలు చేసి దక్కించుకునే అవకాశం ఫ్రాంఛైజీకి మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు ఆ రూల్‌ను కొత్తగా అప్డేట్ చేశారు. దీంతో వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన వ్యక్తిని మళ్లీ బిడ్డింగ్ పెంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ అప్డేట్ రూల్ వల్ల ప్లేయర్‌కే ఎక్కువ ప్రయోజనం తప్ప, ఫ్రాంఛైజీకి మాత్రం ఇబ్బందిగా ఉంటుందని వాదన వినిపిస్తోంది.
ఉదాహరణకు టీమ్ 1 ఒక ప్లేయర్‌ను మెగా వేలంలోకి వదిలింది. వేలంలో టీమ్ 2 అతడిని రూ.6 కోట్లకు దక్కించుకుంది. అయితే అప్పుడు టీమ్ 1 మళ్లీ తన దగ్గర ఉన్న రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించి టీమ్ 2 దగ్గర నుంచి అదే రూ.6 కోట్ల చెల్లించి ఆ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. కానీ, ఇప్పుడు అలా కాదు. కొత్త రూల్ ప్రకారం సదరు ప్లేయర్ కోసం మరోసారి బిడ్ వేసే అవకాశం ఉంది. అంటే అప్పుడు టీమ్ 2 మళ్లీ రూ.8 కోట్లకు పెంచి ఆ ప్లేయర్‌ను తీసుకుంటే, టీమ్ 1 కూడా మళ్లీ ఆ ఆటగాడిని రూ.8 కోట్లకే దక్కించుకోవాలి. లేకపోతే ఆ ప్లేయర్ టీమ్2కే వెళ్లిపోతాడు.
అందుకే ఈ విధానంపై ఐపీఎల్ మెగా వేలం లోపు సమీక్షించాల్సిన అవసరం ఉందని ఫ్రాంఛైజీలు అంటున్నాయి. ఇలా బిడ్డింగ్‌లు వేయడం వల్ల రైట్ టు మ్యాచ్ ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
'అలా జరగడం అత్యంత దారుణం' - అమేలియా రనౌట్‌పై జెమీమా రోడ్రిగ్స్ - Jemimah On RunOut Controversy