మళ్లీ ఈయూ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉర్సులా వాన్ డెర్
Published : Jul 19, 2024, 8:13 AM IST
Ursula von der Leyen Reelected As European Commission President :యూరోపియన్ యూనియన్ (ఈయూ) కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లియోన్(65) మరోసారి ఎన్నికయ్యారు. ఆమె ఇంకో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో గురువారం భేటీ అయిన యూరోపియన్ పార్లమెంటు ఉర్సులా వాన్ డెర్ను ఈయూ కమిషన్ అధ్యక్ష పదవికి మరోసారి ఎన్నుకుంది. మొత్తం 720 మంది సభ్యులున్న ఈయూ చట్టసభలో 707 మంది హాజరుకాగా, ఉర్సులాకు అనుకూలంగా 401 ఓట్లు, వ్యతిరేకంగా 284 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు చెల్లలేదు. 15 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వరుసగా రెండోసారి ఈయూ కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన ఉర్సులా వాన్ డెర్ మాట్లాడుతూ, ఈయూ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పర్యావరణ పరిరక్షణకు, వలసల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.