తెలంగాణ

telangana

అధికారంలోకి వచ్చాక - అవినీతి కేసులో నిర్దోషిగా బయటపడిన యూనుస్‌

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 9:06 AM IST

Updated : Aug 12, 2024, 9:11 AM IST

Muhammad Yunus Corruption Case
Muhammad Yunus Corruption Case (Associated Press)

Muhammad Yunus Corruption Case : బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథి ముహమ్మద్‌ యూనుస్‌కు ఓ అవినీతి కేసు నుంచి విముక్తి లభించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని 'అవినీతి నిరోధక కమిషన్‌' దరఖాస్తు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మహ్మద్‌ రబి ఉల్‌ ఆలం అందుకు ఆమోదించారు. కార్మిక చట్టాల ఉల్లంఘనపై ఉన్న మరో కేసులోనూ యూనుస్‌ను, ముగ్గురు ఉన్నతాధికారులను నిర్దోషులుగా తేలుస్తూ ఢాకాలోని మరో న్యాయస్థానం ఈ నెల 7న ఉత్తర్వులిచ్చింది. షేక్‌ హసీనా పాలనలో యూనుస్‌పై డజన్లకొద్దీ కేసులు నమోదయ్యాయి. 2007లో సైనిక మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు హసీనా కారాగారం పాలయ్యారు. తానొక రాజకీయ పార్టీ పెడతానని యూనుస్‌ ఆ సమయంలో ప్రకటించడం హసీనాకు ఆగ్రహం కలిగించిందని, అందుకే పలు కేసులు మోపారని ప్రచారంలో ఉంది.

Last Updated : Aug 12, 2024, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details