What to Eat for Healthy Skin: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రకరకాల చర్మ సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే వాటి నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా కొందరైతే ముఖంపై ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా స్కిన్ గ్లోయింగ్‌గా కనిపించాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ.. అవి దీర్ఘకాలంలో వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. అందుకే అలాకాకుండా.. బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఖర్చు చేసే డబ్బును మీరు తీసుకునే ఫుడ్ కోసం స్పెండ్ చేస్తే సహజసిద్ధంగా మంచి గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ కె. అశ్విని. అంతేకాదు.. త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ.. చర్మ ఆరోగ్యం కోసం డైలీ డైట్లో చేర్చుకోవాల్సిన ఆ ఆహార పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చర్మం ఆరోగ్యంగా ఉండడం మనం తీసుకునే ఆహారంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుందంటున్నారు న్యూట్రిషనిస్ట్ కె. అశ్విని. సరైన పోషకాహారం తీసుకోవడమే కాకుండా డైలీ తగినంత నీరు తాగడం చాలా అవసరమంటున్నారు. మనం తగిన మొత్తంలో వాటర్ తీసుకోకపోతే బాడీ డీహైడ్రేటెడ్ అవ్వడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందంటున్నారు. ముఖ్యంగా.. చర్మం త్వరగా ముడతలు పడడం, స్కిన్ డ్రైగా మారడం, గ్లోయింగ్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి.. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగడమే కాకుండా.. ఎక్కువ మొత్తంలో ద్రవ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాలన్నీ చర్మానికి మేలు చేసేవే అయినా.. ప్రత్యేకంగా కొన్నింటి గురించి చెప్పుకోవాలి. అలాంటి వాటిల్లో ఒకటి.. అవిసె గింజలు. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల వల్ల చర్మానికి హాని కలగకుండా రక్షించడంలో చాలా బాగా సహయపడతాయంటున్నారు. అలాగే.. చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, సాల్మన్, ట్యూనా, సార్డిన్, చేపలు వంటి వాటిల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని డైలీ డైట్ ఉండేలా చూసుకోవాలంటున్నారు. బాదం, వేరుశనగల్లో ఉండే విటమిన్-ఇ కూడా చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్‌గా ఉపకరిస్తుందంటున్నారు.
పండ్ల విషయానికొస్తే.. కివీ, ఆరెంజ్, అవకాడో, దానిమ్మ, ద్రాక్ష, బ్లూబెర్రీతో పాటు ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని డైలీ డైట్లో ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలాగే.. ఆకుకూరలు, గ్రీన్ వెజిటబుల్స్, టమాటలో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుందని చెబుతున్నారు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్స్ కూడా చర్మానికి మేలు చేసేవే. సీజనల్ ఫుడ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు.
చివరగా మంచి పోషకాహారం తీసుకుంటూ.. రెడిమేడ్‌గా దొరికే ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటివి తగ్గించడం వలన చర్మానికే కాకుండా పూర్తి ఆరోగ్యానికీ మేలు జరుగుతుందంటున్నారు. అలాగే.. మంచి నిద్ర, వ్యాయామం, ఒత్తిడి లేకుండా జీవించడం కూడా చర్మం మంచి మెరుపును సొంతం చేసుకోవడానికి తోడ్పడతాయంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
మొటిమలు తగ్గాలంటే క్రీమ్స్ పూయడం కాదు తిండి మార్చుకోవాలి - ఈ డైట్‌తో ఆల్ క్లియర్!
లెమన్, గ్రీన్ టీలు మాత్రమే కాదు - ఈ టీ తాగినా బోలెడు ప్రయోజనాలు! వయసు కూడా తగ్గిపోతారట!