తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 7:11 AM IST

ETV Bharat / snippets

లెబనాన్‌పై ఇజ్రాయెల్​ భూతల దాడులు - సరిహద్దు స్థావరాలే టార్గెట్

Israel Attack On Lebanon
Israel Attack On Lebanon (Associated Press)

Israel Attack On Lebanon : హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ భూతల దాడులను ప్రారంభించింది. దక్షిణ లెబనాన్‌లోని పలుప్రాంతాల్లో పరిమిత భూతల దాడులు చేపట్టాయి. హెజ్‌బొల్లాపై భారీస్థాయిలో భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌ ముందుస్తు ప్రణాళికలో భాగంగా దాడులను ప్రారంభించింది. విస్తృత కార్యాచరణపై ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ దాడులకు సంబంధించి అమెరికాకు ఇజ్రాయెల్‌ సమాచారం అందించింది. హెజ్‌బొల్లా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకొని లెబనాన్‌ సరిహద్దుల వద్ద పరిమితంగా ఇజ్రాయెల్‌ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ సైన్యం మొదట సరిహద్దుల్లో వైమానిక దాడులు నిర్వహించి భూతల దాడులకు మార్గం సుగమం చేసుకుంది. 2006లో ఇలాంటి ప్రయత్నం ఇజ్రాయెల్‌కు ఇబ్బందికర వాతావరణం సృష్టించింది. మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా సరిహద్దుల వద్ద ఉన్న స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తోంది. వైమానిక దాడులు కొనసాగే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details