ETV Bharat / state

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత - ఏమన్నారంటే? - Samantha On Konda Surekha Comments - SAMANTHA ON KONDA SUREKHA COMMENTS

Samantha Reacted to Minister Konda Surekha Comments : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, వాటిపై ఊహాగానాలు చేయడం మానుకోవాలని కోరారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. మరోవైపు నటుడు నాగచైతన్యసైతం స్పందించారు.

Samantha Reacted to Minister Konda Surekha Comments
Actress Samantha Reacted to Konda Surekha Comments (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 9:11 PM IST

Updated : Oct 2, 2024, 10:53 PM IST

Actress Samantha Reacted to Konda Surekha Comments : తమ విడాకుల పట్ల రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత ఘాటుగా స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, వాటి గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని కోరారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం కావాలన్నారు. తన ప్రయాణానికి గర్వపడుతున్నానని, దాన్ని చిన్నచూపు చూడవద్దని సమంత పేర్కొన్నారు. మంత్రిగా మాట్లాడే వ్యాఖ్యలకు తీవ్రత ఉంటుందన్న విషయం అర్థం చేసుకొని ఉంటారని ఆశిస్తున్నట్లు సమంత వ్యాఖ్యానించారు.

Samantha Reacted to Minister Konda Surekha Comments
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత (ETV Bharat)

వ్యక్తిగతంగా ఉన్న విషయాలను తప్పుగా అన్వయించవద్దని కోరారు. ఇద్దరి అంగీకారంతోనే విడాకాలు తీసుకున్నామని, అందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని సమంత స్పష్టం చేశారు. రాజకీయ యుద్ధాల్లో తన పేరును లాగవద్దన్నారు. తాను రాజకీయాలకు ఎప్పుడూ దూరమేనన్న సమంత, అలాగే కొనసాగుతానని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని సామ్‌ తన సోషల్​ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగచైతన్య, అక్కినేని అమల : అదేవిధంగా టాలీవుడ్​ నటుడు అక్కినేని నాగచైతన్య సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ పోస్ట్​ను రీట్వీట్‌ చేశారు. మరోవైపు నాగార్జున సతీమణి అక్కినేని అమల సైతం ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దని, ఓ మహిళా మంత్రి నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని విచారం వ్యక్తం చేశారు. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్​గాంధీ చొరవ తీసుకోవాలని ఆమె ట్వీట్​లో పేర్కొంది. ​

మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దు - మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున అసహనం - Nagarjuna On Konda Surekha Comments

సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR

Last Updated : Oct 2, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.