Trump Criminal Charges Against Google : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, తాజాగా టెక్ దిగ్గజం గూగుల్‌పై విరుచుకుపడ్డారు. గూగుల్ తన గురించి కేవలం తప్పుడు కథనాలు మాత్రమే చూపిస్తోందని ఆరోపించారు. తను మళ్లీ అధికారంలోకి వస్తే గూగుల్‌పై క్రిమినల్ విచారణకు ఆదేశిస్తానని పేర్కొన్నారు.
"గూగుల్ నా గురించి తప్పుడు కథనాలు మాత్రమే చూపిస్తోంది. తిరిగి వైట్‌హౌస్ పగ్గాలు చేపడితే గూగుల్‌పై క్రిమినల్ విచారణ జరిపిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. గూగుల్ సెర్చ్‌లో డెమోక్రటిక్ ప్రత్యర్థి కమలాహారిస్ గురించి సానుకూల కథనాలు మాత్రమే ప్రదర్శిస్తుంది. ఇది చట్టవిరుద్ధమైన చర్య. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు న్యాయశాఖ క్రిమినల్ విచారణ జరుపుతుందని ఆశిస్తున్నాం. లేకపోతే నేనే వారిపై విచారణ జరపాలని ఆదేశిస్తా’ అని ట్రంప్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇక ట్రంప్ వ్యాఖ్యలపై గూగుల్ స్పందించింది. తాము ఏ ఒక్కరికీ అనుకూలంగా సెర్చ్ ఫలితాలు తారుమారు చేయలేదని వెల్లడించింది.