Minister Seethakka Slams On KTR : మంత్రులైన కొండా సురేఖను, తనను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసభ్యకరంగా దూషిస్తున్నారని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. తాము ఎవరో నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చివాళ్లం కాదని, ప్రజల చేత ఎన్నుకున్న మంత్రులమని స్పష్టం చేశారు. బీసీ, ఎస్టీలుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా, స్వతంత్రంగా మంత్రులుగా ఎదిగామన్నారు. తాము సమ్మక్క- సారలమ్మ, రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చామని, ఎందుకు తమ మీద అక్కసు అని ఆందోళన వ్యక్తం చేశారు.
నెక్లెస్‌రోడ్‌లోని సరస్ ఫెయిర్ - 2024 బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ వెంటపడి దుర్మార్గులు వేధిస్తున్నారని ఆరోపించారు. పనికట్టుకొని సినిమా వాళ్ల గురించి తాము మాట్లాడట్లేదన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉంటుందని, సందర్భానుసారం కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడాల్సి వస్తుందన్నారు. సినిమా యాక్టర్లకు తాము వ్యతిరేకం కాదని, వాళ్లను ద్వేషించడం తమ అభిమతం కాదని స్పష్టం చేశారు.
కేటీఆర్ చాట్ చాట్‌గా కాదు డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడు : కేటీఆర్ చాట్ చాట్‌గా కాదు డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. పండగపూట కూడా తమ వెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్‌కు కుటుంబం ఉంటుందని, ఆయన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారన్నారు. తమ బాధ, ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుందన్నారు. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని ఆరోపించారు.
రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం, కష్టం నిజాయితీ ముందు నువ్వెంత? అని కేటీఆర్‌పై మండిపడ్డారు. వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రజల ఇళ్లను కూలగొట్టి బుల్డోజర్ ప్రభుత్వం నడిపిందన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా మూసీ సుందరీకరణకు సహకరిస్తున్నారన్నారు. మూసీ కూల్చివేతల అంశంలో పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారన్నరు.
సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR