ప్రయాణికులు, సిబ్బందికి ఒకేసారి వాంతులు- విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Published : Jul 29, 2024, 4:12 PM IST
US Flight Diverted Due To Vomiting :విమానం గాల్లో ఉండగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓ ప్రయాణికుడికి ఎడతెగని విధంగా వాంతులయ్యాయి. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తమకు మాస్కులు ఇవ్వాలని విమాన సిబ్బందిని కోరారు. ఈ క్రమంలో విమానంలోని సిబ్బందికి కూడా వాంతులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్ నుంచి బోస్టన్‌కు బయలుదేరిన బోయింగ్ 737-800 మోడల్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని (UA2477) మార్గమధ్యంలోనే వాషింగ్టన్‌లోని డల్లస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. వెంటనే విమానంలోని 155 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడ దిగారు. అనంతరం విమానాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. మరోవైపు డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులను బోస్టన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. జులై 28న జరిగింది ఈ ఘటన.