ముగ్గురు వ్యోమగాములతో తిరిగొచ్చిన రష్యా వ్యోమనౌక సోయజ్
Published : Sep 24, 2024, 8:33 AM IST
Soyuz Space Capsule Return : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో విధులు ముగించుకున్న 3 వ్యోమగాములు రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో సోమవారం భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు. వీరిలో రష్యాకు చెందిన ఒలెగ్ కొనోనెంకో, నికోలాయ్ చబ్, అమెరికా వ్యోమగామి ట్రేసీ డైసన్‌లు ఉన్నారు. ఐఎస్‌ఎస్ నుంచి విడిపోయిన మూడున్నర గంటల తర్వాత సోయజ్ వ్యోమనౌక కజకస్థాన్‌లోని గడ్డినేలల్లో సురక్షితంగా దిగింది. ఒలెగ్, నికోలాయ్‌లు అంతరిక్ష కేంద్రంలో 374 రోజులు ఉన్నారు. ఈ విధంగా రోదసిలో సుదీర్ఘకాలం గడిపిన వ్యోమగాములుగా వారిద్దరూ రికార్డు సృష్టించారు. ట్రేసీ నెలలు పాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించారు.