తెలంగాణ

telangana

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్- వైజాగ్ ఆయనే!

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 2:35 PM IST

Telugu Film Chamber New President
Telugu Film Chamber New President (Getty Images)

Telugu Film Chamber New President :తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈనెల 31తో నిర్మాత దిల్ రాజు పదవి కాలం పూర్తి కావడం వల్ల ఎన్నికలు నిర్వహించారు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా ఠాగూర్ మధు, భరత్ భూషణ్ పోటీ పడ్డారు. మొత్తం 48మంది సభ్యుల్లో 46 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 29మంది సభ్యులు భరత్ భూషణ్ కు అనుకూలంగా 17మంది ఠాగూర్ మధుకు మద్దతుగా ఓటు వేశారు. మెజార్టీ కంటే అధిక ఓట్లు రావడం వల్ల భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో నిర్మాతల సెక్టార్ నుంచి దిల్ రాజును ఎన్నుకున్న సభ్యులు ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి వైజాగ్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్‌ను ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details