ఓటీటీలోకి ఆ పాపులర్ కొరియన్ డ్రామా - ఫైనల్ సీజన్ ఎప్పుడంటే?
Published : Aug 1, 2024, 11:09 AM IST
Squid Game Season 2 Relase Date : సౌత్కొరియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలో పాపులరై ప్రశంసలు అందుకున్న టెలివిజన్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'. 2021లో విడుదలైన ఈ సిరీస్ అప్పట్లో పెద్ద సెన్సేషన్గానే నిలిచింది. అయితే ఇప్పుడు దీని సీక్వెల్గా ఇప్పుడు 'స్క్విడ్ గేమ్ 2' రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి ప్రసారం కానున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. అలాగే ఈ సిరీస్ ఫైనల్ సీజన్ వచ్చే ఏడాది రానున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ తాజాగా ఓ వీడియో ద్వారా తెలిపింది.