తెలంగాణ

telangana

శర్వానంద్​ కొత్త ట్యాగ్​ - ఇకపై తనను అలానే పిలవాలట!

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 6:46 AM IST

Sharwanand
Sharwanand (ETV Bharat Archives)

Sharwanand New Tag :సపోర్టింగ్ రోల్స్​లో మెరిసి, హీరోగా టాప్​ పొజిషన్​కు చేరుకుని టాలీవుడ్​లో మంచి స్టార్​డమ్ సంపాదించారు నటుడు శర్వానంద్. తన నేచురల్ యాక్టింగ్​తో పక్కింటి కుర్రాడిగా కనిపించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ యంగ్ హీరోకు ఎటువంటి ట్యాగ్ లేకపోవడం గమనార్హం. కానీ ఇకపై ఈయన్ను ఫ్యాన్స్ ఓ కొత్త పేరుతో పిలవనున్నారు.

శర్వానంద్ తాజాగా 'మనమే' అనే ఫ్యామిలీ ఎంటర్​టైనర్ మూవీలో నటించారు. ఈ చిత్రం జూన్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఇందులో 'మనమే' నిర్మాత ఈ యంగ్ హీరోకు ​ఛార్మింగ్ స్టార్ అనే టైటిల్​ను ఇచ్చారు. సినిమా టైటిల్ క్రెడిట్స్​లోనూ అదే వాడామని పేర్కొన్నారు. ఇది విన్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తాము శర్వాను ఛార్మింగ్ స్టార్ అని పిలుస్తామంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details