ETV Bharat / state

జాబ్​ కొట్టాలంటే మార్కులే ఉండాలా ఏంటి? - HR​ నిపుణులు ఏం చెబుతున్నారంటే? - Job Getting Skills

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Job Getting Skills : చదువు పూర్తి కావొస్తుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికే ఉద్యోగం వస్తుందట కదా. ప్లేస్​మెంట్స్ ఉన్న కాలేజీలో చదివితే తప్పక ఉద్యోగం వస్తుందంట. మరి ఇప్పుడు ఎలా? చదువుకునే రోజుల్లో ప్రతీ విద్యార్థిని వెంటాడే ప్రశ్నలివి. అలాంటి అపోహాలకు తెర దించుతున్నారు ఉద్యోగ నిపుణులు. మరి ఉద్యోగం రావాలంటే ఏం అవసరం, ఏం నేర్చుకోవాలో చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Essential Skills to Get Tech Job
Essential Skills to Get Tech Job (ETV Bharat)

Essential Skills to Get Tech Job : క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​ విషయంలో విద్యార్థులకు ఎన్నో అపోహలు వస్తుంటాయి. అందులో ప్రధానంగా ఎక్కువ మార్కులు వచ్చిన వారికే అధిక ప్యాకేజీ వస్తుంది, ఇలా ఉంటేనే ఉద్యోగాలు వస్తాయేమో, నాకు ఈ అర్హత లేదు కదా నన్ను ఎంపిక చేస్తారా? లేదా? ఇలా సవాలక్ష ప్రశ్నలు వారి మెదళ్లను తొలి చేస్తుంటాయి. నిజానికి ఉద్యోగాలకు కేవసం మార్కులే ప్రాతిపదిక కాదంటున్నారు ఉద్యోగ నిపుణులు. క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​కు హెచ్​ఆర్​ నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఈ స్టోరీలో చూద్దాం.

కరోనా తర్వాత ఇంటర్వ్యూల్లో చాలా మార్పులే వచ్చాయి. అంతకుముందు ఇంటర్వ్యూలను కంపెనీలో లేదా కాలేజీలో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆన్​లైన్లో నిర్వహిస్తున్నారు. వాటి అనుసారంగా ప్రిపేర్ అవ్వాలి అంటున్నారు. చాలా మందికి సబ్జెక్టుపై అవగాహన ఉన్నా, అది ప్రాక్టికల్​గా చేయలేరు. అలాంటి వారు ప్రాక్టికల్​గా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అంటున్నారు.

  • టెక్​ జాబ్స్​ అయితే ఆయా పోస్టులకు కోడింగ్ చాలా అవసరం. దానితో పాటు డేటా స్ట్రక్చర్స్​, అల్గారిథమ్స్​, సిస్టమ్​ డిజైన్​ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అలాగే చదువుకున్న సబ్జెక్ట్​పై అవగాహన తప్పక ఉండాలి. టీమ్​తో కలిసి పని చేయడానికి కమ్యూనికేషన్​, ప్రాబ్లమ్​ సాల్వింగ్​ వంటి సాఫ్ట్​ స్కిల్స్​ ముఖ్యం.
  • ప్రాంగణ ఎంపికల్లో సెలక్ట్​ అవ్వాలంటే మంచి మార్కులు అవసరమే కానీ, కేవలం మార్కులుంటేనే సరిపోదు. కంపెనీలు అన్నింటిలోనూ ప్రతిభ కనబరిచే విద్యార్థుల పట్లనే ఆసక్తి చూపిస్తాయి.
  • మంచి కమ్యూనికేషన్​, ప్లాబ్లమ్ ​సాల్వింగ్​ స్కిల్స్​, ప్రాక్టికల్​ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఎక్స్​ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్​, ఇంటర్న్​షిప్​లు, ప్రాజెక్టుల వంటివి ఉంటే కచ్చితంగా ఇతరుల కంటే మన అవకాశాలను మెరుగుపరుస్తాయి.

'స్పెషల్ స్కిల్స్' ఉంటేనే జాబ్​- అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్రెండ్! - Special Skills For Job Aspirants

  • ఏ కాలేజీలో ఉన్నా.. స్కిల్స్ ఉంటే చాలు : చాలా మందికి టైర్​-1 కాలేజీల్లో చదివితేనే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి అనే అపోహ ఉంటుంది. అక్కడ చదివితేనే జాబ్​ వస్తుందనే కాదు, టైర్​-2 కాలేజీల్లో చదివినంత మాత్రాన కూడా రాదనీ కాదు. టైర్-2, 3 కాలేజీల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు సొంతంగా కష్టపడి, స్కిల్​ డెవలప్​మెంట్​, నెట్ ​వర్కింగ్​తో ఉద్యోగాలు సాధిస్తున్నారు. కాలేజీ స్థాయి గురించి ఆలోచించకుండా మంచి ప్రొఫైల్​ తయారు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఎన్ని ఎక్కువ స్కిల్స్​ ఉంటే అభ్యర్థుల ప్రొఫైల్​కు అంత వెయిటేజ్​ ఉంటుంది.
  • క్యాంపస్​ ప్లేస్​మెంట్లతోనే ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కూడా సరైంది కాదు. ఆఫ్​​ క్యాంపస్​ ప్లేస్​మెంట్లు, ఇంటర్న్​షిప్స్​, ఫ్రీ-లాన్సింగ్​ ద్వారా సైతం మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అన్నింటికీ బలమైన ప్రొఫెషనల్​ నెట్​వర్క్​ను పెంపొందించుకోవడం చాలా అవసరం.
  • జాబ్​ వచ్చే వరకు ప్రయత్నించాలి : మొదట్లో వైఫల్యాలు ఎదురైనంత మాత్రాన విద్యార్థి ప్రొఫైల్ బాగా లేదని అర్థం కాదు. ప్రతి కంపెనీకి ప్రత్యేక స్కిల్స్ అవసరం. వైఫల్యాలకు వెనుకడుగు వేయకుండా పూర్తిస్థాయిలో ప్రయత్నించినప్పుడే స్థిరమైన విజయాలు అందుకుంటాం.
  • కేవలం ఎక్కవ జీతం వస్తేనే ఉద్యోగం బాగుంటుందని అని చెప్పడం కాదు. ఉద్యోగం తీరు, కంపెనీ పద్ధతులు, నేర్చుకునేందుకు ఉన్న అవకాశాలు, పని - వ్యక్తిగత జీవితం, దీర్ఘకాలంలో కెరియర్​ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఉద్యోగాన్ని నిర్ణయించుకోవాలి.

కోరుకున్న ఉద్యోగం రావాలా? 'క్రిటికల్ థింకింగ్' స్కిల్ ఉండాల్సిందే! - How To Improve Critical Thinking

AI ఎంత డెవలప్ అయినా ఈ స్కిల్ ఉంటే చాలు - జాబ్ గ్యారెంటీ! - Best Job Skills

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.