'భారతీయుడు 2'కు తెలుగులో రికార్డ్ బిజినెస్! - హిట్ స్టేటస్‌కు ఎన్ని కోట్లు రావాలంటే?
Published : Jul 11, 2024, 1:19 PM IST
Bharateeyudu 2 Telugu States Business : విశ్వనాయకుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భారతీయుడు 2'. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. భారతీయుడుకు సీక్వెల్ వస్తున్న ఈ చిత్రంపై చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవ్వడం శంకర్‌కు ఎంతో కీలకమో, తెలుగులో కమల్ మార్కెట్ పెరగడానికి అంతే కీలకం. అయితే తాజాగా తెలుగులో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజనెస్ వివరాలు బయటకు వచ్చాయి. రికార్డు స్థాయిలోనే బిజినెస్ జరిగినట్లు తెలిసింది. తెలంగాణ నైజాంలో రూ. 9కోట్లు, ఆంధ్రాలో రూ. 11కోట్లు, సీడెడ్‌లో రూ. 4కోట్లతో కలుపుకుని రూ. 24 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25.00 కోట్లుగా నమోదైంది. ఈ లెక్కన ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. చూడాలి మరి కమల్ బాక్సాఫీస్ జోరును కొనసాగిస్తారో లేదో.