Sai Durga Tej Manchu Manoj Movie :యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీలో నటిస్తున్నారు. రోహిత్ కె.పి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాలో కోసం టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
సాయితేజ్ మూవీలో మనోజ్ ఎంట్రీ - ఇద్దరిదీ పవర్ఫుల్ రోల్సే!
Published : Jul 28, 2024, 8:36 AM IST
|Updated : Jul 28, 2024, 9:18 AM IST
Sai Durga Tej Manchu Manoj Movie (ETV Bharat)
ఇక ఈ సినిమాలో మనోజ్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నారని సమాచారం. అయితే సాయితేజ్ పాత్రకు దీటుగా మనోజ్ పాత్ర ఉండనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆగస్టులో మొదలు కానున్న కొత్త షెడ్యూల్లో మనోజ్ సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
Last Updated : Jul 28, 2024, 9:18 AM IST