'రాజాసాబ్' వచ్చేస్తున్నాడు - ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ కోసం రెడీనా ఫ్యాన్స్?
Published : Jul 28, 2024, 11:36 AM IST
|Updated : Jul 28, 2024, 11:54 AM IST
Prabhas The Rajasaab Glimpse :ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్వీట్ అప్డేట్ గురించి ది రాజాసాబ్ మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు టైమ్ ఫిక్స్ చేశారు. రేపు (జులై 29)న సాయంత్రం 5.03 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. ప్రభాస్‌కు సంబంధించిన ఓ స్పెషల్ ఫొటోతో ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఇక ఇది చూసి ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. త్వరగా విడుదల చేయండి అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.