ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - ప్రశాంత్ నీల్ సినిమా ఆ రోజే షురూ!
Published : Aug 1, 2024, 3:31 PM IST
NTR - Prasanth Neel Movie Shooting Update :కేజీయఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో NTR 31 తెరకెక్కాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీకి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చి తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే - ఈ భారీ బడ్జెట్ సినిమా చిత్రీకరణను సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందింది. మొదటి షెడ్యూల్‌ను తారక్ లేకుండానే చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇది కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్‌నీల్ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలిసింది.