ETV Bharat / international

ట్రంప్ కోసం 12 గంటలు వెయిట్ - ఆహారం వెంటతెచ్చుకొని మరీ! - Donald Trump latest

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 7:42 AM IST

Updated : Sep 17, 2024, 8:32 AM IST

Donald Trump latest : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఫ్లోరిడాలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు దాదాపు 12 గంటలపాటు ఘటనాస్థలంలో తచ్చాడినట్లు అధికారులు తెలిపారు. రైఫిల్​తో పాటు ఆహారం కూడా వెంట తెచ్చుకున్నాడని పేర్కొన్నారు.

Donald Trump
Donald Trump (ANI)

Donald Trump latest : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఫ్లోరిడాలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి గురించి కీలక విషయాలు వెల్లుగులోకి వచ్చాయి. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాన్‌ వెస్లీ రౌత్‌ (58) దాదాపు 12 గంటలపాటు ఘటనాస్థలంలో తచ్చాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెస్లీ రౌత్‌ అరెస్టు చేసిన అధికారులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. సెల్‌ఫోన్‌ రికార్డుల ఆధారంగా అతడి కదలికల వివరాలను అధికారులు కోర్టు పత్రాల్లో ప్రస్తావించారు. రైఫిల్‌తోపాటు ఆహారం కూడా వెంట తెచ్చుకున్నాడని పేర్కొన్నారు.

వెస్లీ రౌత్​పై భియోగాలు
వెస్లీ రౌత్​పై ఫెడరల్‌ గన్‌ క్రైమ్స్‌కు సంబంధించి పలు అభియోగాలు మోపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడని, పైగా గతంలోనే దాని అనుమతి రద్దయిందని అధికారులు ఆరోపించారు. దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతున్నందున అతడిపై మరిన్ని కేసులు మోపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు వెస్లీ రౌత్​పై నేరాభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్‌ జ్యూరీని న్యాయవాదులు అభ్యర్థించారు.

ఎవరీ ర్యాన్​ వెస్లీ?
ర్యాన్‌ వెస్లీ రౌత్‌ తన కుమారుడితోపాటు షెడ్లు నిర్మించే సంస్థను నిర్వహిస్తున్నాడు. 2018 వరకూ నార్త్‌ కరోలినాలో ఉన్న అతడు ఆ తర్వాత హవాయ్‌లోని కావాకు మకాం మార్చాడు. ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించే రౌత్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభిమాని. ఉక్రెయిన్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటాడు.

ట్రంప్‌ను హత్యచేయడానికే!
ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఆదివారం జరిగిన ఘటన మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నంలో భాగమేనని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ట్రంప్‌నకు 300 నుంచి 500 గజాల దూరంలో ఉన్న ఫెన్సింగ్‌ వద్దకు తుపాకీతో వచ్చిన నిందితుడు భద్రతా బలగాలు కాల్పులు జరపడం వల్ల తన వాహనంలో పారిపోయాడని వివరించాయి. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపాయి. నిందితుడు కాల్పులు జరిపిందీ లేనిదీ తెలియరాలేదని మయామీ సీక్రెట్‌ సర్వీస్‌ స్పెషల్‌ ఇన్‌ఛార్జ్‌ రఫేల్‌ బారోస్‌ సోమవారం వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా ఉన్న ట్రంప్‌ను హత్యచేయడానికే అతడు వచ్చినట్లు ఎఫ్‌బీఐ ఇప్పటికే వెల్లడించింది.

'సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే'- ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో డైరెక్టర్‌ అంగీకారం - Trump Shooting Case

'అతడి కోసం నాపై కాల్పులు జరిగిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా'- డొనాల్డ్ ట్రంప్

Last Updated : Sep 17, 2024, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.