Nithiin Robinhood Movie Release :టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రాబిన్‌హుడ్' సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొదట ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు.
'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్ - నితిన్ సినిమా పోస్ట్‌పోన్!
Published : Jul 26, 2024, 7:57 AM IST
Nithiin Robinhood Movie Release (ETV Bharat)
కానీ అప్పటికే ఇదే నిర్మణ సంస్థ 'గేమ్ ఛేంజర్'ను రిలీజ్ చేసేందుకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 'రాబిన్‌హుడ్' రిలీజ్‌ను 2025 ఫిబ్రవరీకే దాదాపుగా ఫిక్స్ చేయనున్నట్లు సినీ వర్గాల మాట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.