కేరళ సీఎంను కలిసిన చిరంజీవి - వయనాడ్ బాధితుల కోసం చెక్కు అందజేత
Published : Aug 8, 2024, 8:28 PM IST
Chiranjeevi Wayanad Disaster : మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిశారు. వయనాడ్ బాధితుల కోసం తన వంతు బాధ్యతగా రూ. కోటి చెక్కును సీఎంకు అందజేశారు. అలా ఈ ఇద్దరు కాసేపు పలు అంశాలపై చర్చించుకున్నారు. కాగా, భారీ వర్షాల వల్ల కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. దీంతో బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతుగా విరాళాలను ఇచ్చారు. అలా తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి కూడా రూ. కోటి విరాళాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు తాజాగా సీఎంను(chiranjeevi Pinarayi Vijayan) నేరుగా కలిసిన చిరు చెక్కును అందించారు. ఇంకా ప్రభాస్, అల్లుఅర్జున్, విక్రమ్, సూర్య, మోహన్‌లాల్, కమల్‌హాసన్, నయనతార, ఫహాద్‌ఫాజిల్, రష్మిక తదితరులు కూడా వయనాడ్ బాధితులకు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు.