Casio Ring Watch: ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్లో కొత్త కొత్త ప్రొడక్ట్స్ పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్ఫోన్లు అదిరే ఫీచర్లతో స్టన్నింగ్ లుక్‌లో విడుదలవుతున్నాయి. అయితే వీటికేం తీసిపోకుండా ఇదే రీతిలో స్మార్ట్‌వాచ్‌లు కూడా మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. మణికట్టుపై కేవలం 2 అంగుళాల లోపు డిస్ప్లేతో కనిపించే ఈ వాచ్‌లలో స్మార్ట్ఫోన్లకు తీసిపోని ఇంట్రెస్టింగ్ ఫీచర్లతో వస్తున్నాయి.
దీంతో స్మార్ట్‌వాచ్‌ల సేల్స్ ఆశ్చర్యకర రీతిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్లో తమ అప్డేటెడ్ స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో డిజిటల్ వాచ్‌ల తయారీకి పేరుగాంచిన క్యాసియో వినూత్న ఆవిష్కారంతో ముందుకొచ్చింది. ఫింగర్ రింగ్‌లో స్మార్ట్‌వాచ్‌ను ఫిట్ చేసి రీలీజ్ చేసింది. ఇది కంపెనీ మొట్ట మొదటి రింగ్ వాచ్.
అంగుళం కంటే చిన్న పరిమాణంలో ఉన్న ఈ రింగ్ వాచ్‌ను కంపెనీ ఏడు సెగ్మెంట్ల LCD స్క్రీన్‌తో తీసుకొచ్చింది. ఇది గంటలు, నిమిషాలు, సెకన్లను చూపిస్తుంది. ఇందులో మూడు ఫిజికల్ బట్స్ ఉంటాయి. వీటి సహాయంతో టైమ్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాక ఇందులో స్టాప్‌వాచ్ ఫీచర్ కూడా ఉంది.
ఈ రింగ్ వాచ్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన బెజెల్స్‌తో టిన్నీ కేస్ కూడా ఉంది. ఇది స్క్రీన్ లైట్ సోర్స్. చీకటిలో టైమ్‌ను చూసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ రింగ్ వాచ్‌కు స్పీకర్ లేదు. కానీ అలారం మోగినప్పుడు ఫ్లాష్ అవుతుంది. ఈ రింగ్ వాచ్ ఇటీవలే శాంసంగ్ రిలీజ్ చేసిన స్మార్ట్‌రింగ్ మాదిరిగానే అనిపించొచ్చు. అయితే ఇందులో స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ లేదా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ వంటి ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఏవీ లేవు.
మెషిన్-ట్రాన్స్‌లేటెడ్ వెర్షన్ వెబ్‌సైట్ ప్రకారం.. క్యాసియో వాచ్‌ను ఫుల్ మెటల్ డిజైన్‌తో రింగ్ సైజ్‌లో రూపొందించారు. దీన్ని రోజువారీ వినియోగం కోసం వాటర్‌ప్రూఫ్ టచ్‌తో తీసుకొచ్చారు. ఇది ఈజీ రీప్లేస్బుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది 2 సంవత్సరాల వరకు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తుందని క్యాసియో తెలిపింది. ఈ రింగ్ సైజ్ 20 మిమీ. కానీ ప్యాకేజీలో 19 మిమీ, 18 మిమీ ఇన్నర్ డయామీటర్ సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం స్పేసర్‌లు ఉన్నాయని వెబ్‌సైట్ తెలిపింది.
క్యాసియో తన 50వ వార్షికోత్సవం సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ కొత్త రింగ్ వాచ్‌ను రెడీ చేసింది. ఇది డిసెంబర్లో ¥19,800 జపాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇండియన్ రూపీస్‌లో దీని ధర దాదాపు రూ.10,810 ఉంటుంది.
'హువావే మేట్ 70' సిరీస్ వచ్చేస్తున్నాయోచ్!- రిలీజ్ ఎప్పుడంటే?
దిమ్మతిరిగే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్!- లీక్స్ వచ్చేశాయ్!