ETV Bharat / bharat

పెళ్లి కొడుకు కోసం ట్రైన్ ఆపేసిన రైల్వే శాఖ- ఎందుకిలా చేసిందంటే?

పెళ్లి కుమారుడి కోసం రైలును లేటుగా నడిపిన రైల్వే శాఖ- అధికారులకు వరుడు కృతజ్ఞతలు- రైల్వే శాఖ తీరును తప్పుబట్టిన ప్రజలు!

Railways Detain Connecting Train For Marriage
Railways Detain Connecting Train For Marriage (ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Railways Detain Connecting Train For Marriage : ఓ వధూవరువుల జంటను కలిపేందుకు రైల్వేశాఖ ఏకంగా ఓ రైలును కొన్ని నిమిషాల పాటు వారి కోసం నిలిపివేసింది. బంగాల్‌లోని హావ్‌డాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబయికి చెందిన చంద్రశేఖర్‌ వాఘ్‌ అనే వ్యక్తి అసోంలోని గువాహటిలో తన పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ముంబయి నుంచి వయా బంగాల్లోని హావ్‌డా మీదుగా పెళ్లి బృందం గువాహటికి చేరుకోవాలి.

వరుడు చంద్రశేఖర్‌, అతడి కుటుంబ సభ్యులు మొత్తం 34 మందితో కూడిన పెళ్లి బృందం ఈనెల 14న గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ముంబయి నుంచి హావ్‌డా బయలుదేరారు. తర్వాతి రోజు 15వ తేదీన హావ్‌డాకు చేరుకొని అక్కడ నుంచి సాయంత్రం- 4 గంటల 5 నిముషాలకు బయలుదేరే సరాయ్‌ఘాట్‌ ఎక్స్‌ప్రెస్‌లో గువాహటి వెళ్లాల్సి ఉంది. ముంబయి నుంచి బయలుదేరిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 5 నిముషాలకు హావ్‌డా చేరుకోవాల్సి ఉంది. అయితే, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ మూడున్నర గంటలు ఆలస్యమైంది. గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యం కావడం వల్ల తదుపరి రైలును అందుకోలేమని భావించిన వరుడు చంద్రశేఖర్‌ రైల్వే శాఖను సాయం కోరాడు.

రైలు ఆలస్యం కారణంగా సమయానికి తాము పెళ్లి మండపానికి చేరుకోలేకపోతున్నానని, తన పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని సాయం చేయాలని కోరుతూ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా రైల్వే శాఖను కోరాడు. తమ రిజర్వేషన్‌ టికెట్ల ఫోటోలను దానికి జత చేశాడు. ఇందుకు స్పందించిన రైల్వేశాఖ ఉన్నతాధికారులు హావ్‌డా రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చి సరాయ్‌ఘాట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కాసేపు నిలిపివేశారు. సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ రాగానే వారిని బ్యాటరీ వాహనాల్లో 24వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి 9వ నంబరు ప్లాట్‌ఫాంకు తరలించి, ఆ తర్వాత వారిని సరాయ్‌ఘాట్‌ ఎక్స్‌ప్రెస్‌లో అధికారులు ఎక్కించారు. రైలును ఆపకపోతే పెళ్లి తంతు నిలిచిపోయేదని, తమకు సాయం చేసినందుకు పెళ్లి వారు రైల్వేశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవలందించడం తమ నైతిక బాధ్యత అని రైల్వేశాఖ బదులిచ్చింది.

"మేము గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాం. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యమైంది. మేము సరాయ్‌ఘాట్‌ ఎక్స్‌ప్రెస్‌ను అందుకోలేమని అర్థమైంది. ఆ సమయంలో నేను రైల్వేశాఖకు ట్వీట్ చేశాను. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఇతర తూర్పు రైల్వే డివిజనల్ అధికారులను కూడా ట్యాగ్ చేశాను. వారు నా ట్వీట్‌ను గమనించి చాలా త్వరగా, వేగంగా స్పందించారు. వారు(రైల్వే అధికారులు) దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. వారు గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టారు. లేకపోతే మేము సమయానికి హావ్‌డా స్టేషన్‌కు చేరుకోలేపోయేవాళ్లం."
--చంద్రశేఖర్‌ వాఘ్‌, వరుడు

"అతను(పెళ్లి కొడుకు) రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మా ఎక్స్‌ ఖాతాలో సహాయం కోరాడు. అక్కడి నుంచి సమాచారం అందింది. మా చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఫ్రెడ్ నాకు ఫోన్‌ చేశారు. తర్వాత నేను హావ్‌డా సీనియర్ డీసీఎమ్‌ రాహుల్‌ రంజన్‌కు ఫోన్‌ చేశాను. ఆయన తన బృందంతో కలిసి తగిన చర్యలు తీసుకోవడంతో వారు(పెళ్లి బృందం) సమయానికి సరాయ్‌ఘాట్‌ ఎక్స్‌ప్రెస్‌ను అందుకున్నారు."
--కౌశిక్‌ మిత్ర, సీఆర్‌పీఓ, తూర్పు రైల్వే డివిజన్‌

అయితే, రైల్వేశాఖ తీరుపై మిశ్రమ స్పందన వస్తోంది. ఒక రైలు ఆలస్యమైతే మరో రైలును ఆలస్యంగా నడపడం ఎంతవరకు న్యాయమని సోషల్‌ మీడియాలో పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రైల్వే శాఖ ఇలా చేసిందని మండిపడుతున్నారు. రైళ్లు ఆలస్యం కాకుండా నడపలేకపోతున్నారని రైల్వే శాఖ తీరును తప్పుపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.