ETV Bharat / entertainment

'పుష్ప 2' ట్రైలర్‌ విధ్వంసం - ఆ రికార్డ్​ సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా ఘనత! - PUSHPA2 TRAILER RECORD VIEWS

రికార్డుల వేట మొదలు పెట్టిన ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ 'పుష్ప 2'.

Allu Arjun Pushpa2 Trailer Records
Allu Arjun Pushpa2 Trailer Records (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 2:12 PM IST

Allu Arjun Pushpa2 Trailer Records : రిలీజ్​కు ముందే పుష్ప రాజ్‌ రికార్డుల వేట మొదలు పెట్టేశాడు. ప్రీ సేల్‌లో పలు రికార్డులను ఖాతాలో వేసుకున్న పుష్ప 2, తాజాగా ట్రైలర్‌ విషయంలోనూ మరో ఘనతను అందుకుంది. డైరెక్టర్​​ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ సినిమా ట్రైలర్​ కోసం చాలా రోజుల నుంచి ఫ్యాన్స్​​ ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ 'పుష్ప రాజ్‌ అంటే ఇప్పుడు ఫైర్ కాదు వైల్డ్‌ ఫైర్‌' అంటూ అల్లు అర్జున్‌ ప్రేక్షకుల ముందుకొచ్చారు.

దీంతో ఈ ట్రైలర్‌ విడుదలైన కొద్ది క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ దూసుకుపోతోంది. ఈ ప్రచార చిత్రంతో సౌత్‌ ఇండియాలో బన్నీ ఓ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.

సౌతిండియాలోనే అత్యంత వేగంగా 40 మిలియన్ల వీక్షణలు సాధించిన తెలుగు ట్రైలర్‌గా పుష్ప 2 నిలిచింది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఆల్‌ టైమ్‌ రికార్డు అని నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. 'ఈ పుష్పరాజ్‌ రికార్డుల పుస్తకాలను కూడా రూల్‌ చేస్తున్నాడు' అని పేర్కొంటూ ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్ చేసింది. దీన్ని చూసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. మరో వైపు ఈ ప్రచార చిత్రంపై ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అత్యధిక మంది చూసిన లైవ్‌ ఈవెంట్‌ ఇదే - ఇక ట్రైలర్‌ లాంఛ్​ ఈవెంట్‌లోనూ పుష్పరాజ్‌ తన హవా చూపించాడు. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడడానికి 2.6 లక్షల మంది తరలి వచ్చారు. ఈవిషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఎక్కువ మంది చూసిన లైవ్‌ ఈవెంట్‌ ఇదేనని పేర్కొంది. పుష్ప రాజ్‌ వస్తున్నాడంటే రికార్డులు కూడా వచ్చేస్తాయి అని రాసుకొచ్చింది.

ఎట్టకేలకు కంగన 'ఎమర్జెన్సీ' విడుదల ఖరారు - కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్​

'పుష్ప 2 నిజంగానే వైల్డ్​ ఫైర్'​ - ట్రైలర్​పై సినీ సెలబ్రిటీల రివ్యూస్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.