రాయన్ సూపర్ రికార్డ్ - ధనుశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్
Published : Jul 29, 2024, 2:22 PM IST
Dhanush Raayan Collections : ధనుశ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాయన్. రీసెంట్గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రికార్డుల దిశగా వెళ్తోంది. తాజాగా ఈ మూవీ ధనుశ్ కెరీర్లోనే అత్యధిక వారాంతపు ఓపెనింగ్స్‌ను సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.75కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈనేపథ్యంలోనే తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు ధనుశ్. తమ సినిమా సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేశారు. "మా సినిమాకు విజయాన్ని అందించిన సినీ ప్రేక్షకులు, ఆత్మీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. నాపై అమితమైన ప్రేమ చూపించి, అండగా నిలబడుతున్న ఫ్యాన్స్‌కు స్పెషల్ థ్యాంక్స్. ఇప్పటివరకూ నేను అందుకున్న ది బెస్ట్ బ్లాక్‌బస్టర్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే" అంటూ రాసుకొచ్చారు. సినిమాలో ధనుశ్‌తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్ కూడా నటించారు.